కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT 2026కు సిద్ధమేనా?.. ఆగస్టు 3 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌తో పాటు కీలక తేదీలను IIM ప్రకటించింది..

కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT 2026కు సిద్ధమేనా?.. ఆగస్టు 3 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..
CAT 2026 Notification

Updated on: Jul 26, 2026 | 2:33 PM

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌తో పాటు కీలక తేదీలను IIM ప్రకటించింది. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3న నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులు సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక నవంబర్ 29న దేశవ్యాప్తంగా 170 నగరాల్లో మూడు విడతల్లో ఒకే రోజు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. నవంబర్ 4 నుంచి పరీక్ష తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు 2027 జనవరి మొదటి వారంలో వెల్లడించే అవకాశం ఉంది. క్యాట్‌ 2026 స్కోరు 2027 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ కింది IIM క్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • CAT 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 3, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుంచి
  • దరఖాస్తుల చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
  • CAT 2026 పరీక్ష తేదీ: నవంబర్ 29 (ఆదివారం), 2026.

CAT 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

CAT 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. SC, ST, PwD అభ్యర్థులు 45 శాతం ఉత్తీర్ణత సాధించినా సరిపోతుంది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. CAT స్కోర్ ఆధారంగా IIMలు మాత్రమే కాకుండా FMS Delhi, SPJIMR, MDI Gurgaon, IIFT, IITల మేనేజ్‌మెంట్ విభాగాలు సహా అనేక ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో MBA/PGDM ప్రవేశాలు కల్పిస్తారు. CAT 2026కు సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అర్హత, పరీక్షా విధానం, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

CAT 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us