Bank of India Jobs 2022: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 క్రెడిట్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? కొన్ని గంటల్లో ముగియనున్న..

|

May 09, 2022 | 10:10 AM

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India).. రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్‌ పోస్టుల (Credit Officer Posts)కు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది..

Bank of India Jobs 2022: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 క్రెడిట్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? కొన్ని గంటల్లో ముగియనున్న..
Bank Of India
Follow us on

Bank of India Credit Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India).. రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్‌ పోస్టుల (Credit Officer Posts)కు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొ్ంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 696

పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్‌, ఎకనామిస్ట్‌, స్టాటిస్టిషియన్‌, రిస్క్‌ మేనేజర్‌, క్రెడిట్‌ అనలిస్ట్‌, టెక్‌ అప్రైజల్‌, ఐటీ ఆఫీసర్ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • రెగ్యులర్‌ పోస్టులు: 594
  • కాంట్రాక్ట్‌ పోస్టులు: 102

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలేజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.850
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 175

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 26, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SECR Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్‌! సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 1033 అప్రెంటిస్‌ ఉద్యోగాలు..