AP Entrance Exam Schedule 2023: ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల.. ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌తోసహా వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ సోమవారం (జనవరి 23) విడుదల చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌తోసహా వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ సోమవారం (జనవరి 23) విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏపీ ఈఏపీసెట్-2023 పరీక్ష మే 15 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా వివిధ యూనివర్సిటీల్లో వివిధ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..
ఏపీ ఈసెట్-2023 పరీక్ష మే 5
ఏపీ ఈఏపీసెట్-2023 (ఎంపీసీ) స్ట్రీమ్ పరీక్ష మే 15 నుంచి 22 వరకు
ఏపీ ఈఏపీసెట్-2023 (బైపీసీ) స్ట్రీమ్ పరీక్ష మే 23 నుంచి 25 వరకు