APPSC Group-1 నోటిఫికేషన్ 2022 విడుదల.. జోన్ల వారీ ఖాళీలు, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ -1 సర్వీసుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ -1 సర్వీసుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 2, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.120లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.54,060ల నుంచి రూ.1,51,370ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.