AP POLYCET 2026 ఫలితాలు విడుదల! నిమిషాల్లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే!

AP POLYCET 2026 Results Announced: ఏపీ పాలిసెట్ ఫలితాలు మంగళవారం ఉదయం రాష్ట్రం మంత్రి లోకేష్ విడుదల చేశారు. మొత్తం 1,63,008 మంది పరీక్ష రాయగా 1,48,950 మంది అర్హత సాధించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://polycetap.ap.gov.in లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

AP POLYCET 2026 ఫలితాలు విడుదల! నిమిషాల్లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే!
Ap Polycet 2026 Results

Updated on: May 05, 2026 | 1:26 PM

AP POLYCET 2026 Results: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), ఆంధ్రప్రదేశ్ మంగళవారం ఉదయం అధికారికంగా ఫలితాలను ప్రకటించింది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్ కార్డ్స్, ర్యాంక్ కార్డ్స్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పాలిసెట్ ఫలితాలను ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మంత్రి నారా లోకేష్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://polycetap.ap.gov.in/Default.aspx ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్ కోర్సుల్లో డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు.

ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్.. ట్విట్టర్ వేదికగా వివరాలను పంచుకుంటూ విద్యార్థులను అభినందించారు.
ఈ సంవత్సరం, 25.04.2026న జరిగిన పరీక్షకు రికార్డు స్థాయిలో 1,77,581 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1,63,008 మంది హాజరయ్యారు. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. వీరిలో 1,48,950 మంది ఉత్తీర్ణులయ్యారు, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37%. బాలికలు 93.57% ఉత్తీర్ణత శాతంతో బాలురను అధిగమించడం సంతోషకరమైన విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ టెక్నోక్రాట్లుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దాలనే మా నిబద్ధతకు నిదర్శనం. అంతేగా, మన గిరిజన జిల్లాల నుంచి వెలువడిన బలమైన పనితీరు కూడా హర్షదాయకంగా ఉంది అని మంత్రి పేర్కొన్నారు.

ఫలితాలు తెలుసుకునేందుకు డైరెక్ట్ లింక్.. https://polycetap.ap.gov.in
వాట్సాప్ (మన మిత్ర): 9552300009 నంబర్‌కు “Hi” అని పంపి ఫలితాలు పొందండి.

Follow Us