AP POLYCET 2022: ఏపీ పాలీసెట్ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే..

|

Apr 12, 2022 | 6:38 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గానూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2022కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది..

AP POLYCET 2022: ఏపీ పాలీసెట్ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే..
Upsc Ese 2021 Results
Follow us on

AP Polycet 2022 Registration last date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గానూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2022కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ polycetap.nic.inలో, ఆన్‌లైన్‌ మోడ్‌లో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు ఏప్రిల్‌/మే 2022 టెన్త్‌ పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్ధులు కూడా అర్హులే.

రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.400లు విధిగా చెల్లించాలి. ఏప్రిల్‌ 11 నుంచి వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్ధులు చివరితేదీ వరకు వేచి ఉండకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా మండలి ఈ సందర్భంగా సూచించింది. ఇక పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష (AP Polycer 2022) మే 29 (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఇంజనీరింగ్ / నాన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి (SBTET AP) ప్రతి ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఫలితాలు జూన్‌ 10 విడుదల్యే అవకాశముంది. ఇతర తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/Default.aspx లో చెక్‌ చేసుకోవచ్చు లేదా 7901620551, 7901620567 ఫోన్‌ నెంబర్లను సంప్రదించవచ్చు లేదా polycetap@gmail.comకు ఈమెయిల్ చేయవచ్చు.

Also Read:

Bank of Baroda Recruitment 2022: ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే