
Washing Machine Tips: బట్టలు ఉతికిన తర్వాత మంచి సువాసన రావడానికి, మృదువుగా ఉండటానికి మనం తరచుగా ఫ్యాబ్రిక్ కండిషనర్‌లను, ముఖ్యంగా కంఫర్ట్ వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తాం. అయితే, చాలామంది చేసే ఒక సాధారణ తప్పు ఏమిటంటే, డిటర్జెంట్‌తో పాటే కంఫర్ట్‌ను కూడా వాషింగ్ మెషీన్‌లో వేయడం. ఈ విధానం బట్టలకు సరిగా పట్టకుండా చేస్తుంది. సరైన ఫలితాల కోసం వాషింగ్ మెషీన్ రకాన్ని బట్టి కంఫర్ట్ వేసే సమయం మారుతుందంటున్నారు నిపుణులు.
టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లలో బట్టలు రిన్స్ సైకిల్‌లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ సమయంలో మెషీన్ డోర్ తెరిచి కంఫర్ట్‌ను వేయాలి. ఇలా చేయడం వల్ల అది బట్టలకు పూర్తిగా పట్టి, సువాసన బాగా నిలుస్తుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల విషయంలో, కంఫర్ట్‌ను వాషింగ్ ప్రారంభంలోనే లేదా రిన్స్ సైకిల్ సమయంలో వేయడం ఉత్తమం. కొన్ని మెషీన్‌లలో దీనికి ప్రత్యేక కంపార్ట్‌మెంట్ కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?
ఈ సరైన సమయాల్లో కంఫర్ట్‌ను వేయడం వల్ల బట్టలకు అది సమర్థవంతంగా అప్లై అవుతుంది. దీని ద్వారా బట్టలు మరింత మృదువుగా మారి, మీరు ఆశించిన మంచి సువాసన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. వాషింగ్ మెషీన్ రకాన్ని బట్టి సరైన పద్ధతిని పాటించడం వల్ల దుస్తులు తాజాగా, మంచి సువాసనతో ఉంటాయి.
ఇది కూడా చదవండి: Compound Walls: ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే గోడ బీటలు వారడం ఖాయం!
ఇవి కూడా చదవండి:
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న ధరలు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి