Telugu News Business What Happens If You Don't Use Your Credit Card for a Long Time? Impact on Credit Score and RBI Guidelines Explained
Credit Card: మీ క్రెడిట్ కార్డును వాడకుండా అలాగే ఉంచితే ఏమవుతుంది? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
Credit Card: క్రెడిట్ కార్డును చాలా కాలం పాటు ఉపయోగించకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేటప్పుడు వ్యక్తుల క్రెడిట్ స్కోరు, క్రెడిట్ రిపోర్ట్‌ను చూస్తాయి. మంచి క్రెడిట్ స్కోరును కలిగి ఉండటానికి, క్రెడిట్ కార్డు నిర్వహణ, రుణ..
Credit Card: చాలామంది క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత వాడకుండా ఉండలేరు. కొందరు మాత్రం దాన్ని వాడకుండా కేవలం అత్యవసర పరిస్థితుల కోసం లేదా అదనపు కార్డుగా అలాగే ఉంచుతుంటారు. అయితే ఇలా ఎక్కువ కాలం కార్డును వాడకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కార్డు క్లోజ్ అయ్యే అవకాశం: ఆర్‌బీఐ (RBI) నిబంధనల ప్రకారం, ఒక క్రెడిట్ కార్డును ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీల కోసం వాడకపోతే, బ్యాంకులు ఆ కార్డును క్లోజ్ చేయవచ్చు. అయితే ఇలా చేసే ముందు బ్యాంకు మీకు 30 రోజుల సమయం ఇస్తున్నట్లు సమాచారం అందిస్తుంది.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం: మీ పాత కార్డును వాడకపోవడం వల్ల మీ ‘క్రెడిట్ హిస్టరీ’ నిడివి తగ్గిపోవచ్చు. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు మీరు ఎంత కాలం నుండి కార్డు వాడుతున్నారనేది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కార్డు క్లోజ్ అయితే మీ స్కోర్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR): మీ దగ్గర రెండు మూడు కార్డులు ఉన్నప్పుడు మీ మొత్తం క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. ఒక కార్డు క్లోజ్ అయితే మీ లిమిట్ తగ్గిపోతుంది. అప్పుడు మీరు మిగిలిన కార్డుల మీద చేసే ఖర్చు శాతం (Ratio) పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.
వార్షిక రుసుము (Annual Fees): మీరు కార్డును వాడకపోయినా, దానికి సంబంధించిన యాన్యువల్ ఫీజులు లేదా మెయింటెనెన్స్ ఛార్జీలు పడుతూనే ఉంటాయి. వీటిని గమనించకుండా చెల్లించకపోతే అది పెనాల్టీలకు, స్కోర్ తగ్గడానికి దారితీస్తుంది.
నిపుణుల సలహా:
మీ కార్డు క్లోజ్ కాకుండా ఉండాలంటే కనీసం ఆరు నెలలకు ఒకసారి చిన్న చిన్న లావాదేవీలు (ఉదాహరణకు మొబైల్ రీఛార్జ్ లేదా గ్రాసరీ షాపింగ్) చేస్తూ ఉండాలి. కార్డు అవసరం లేదని అనుకుంటే, మీరే స్వయంగా బ్యాంకును సంప్రదించి సరైన పద్ధతిలో క్లోజ్ చేయడం ఉత్తమం.