Vehicle Number Plates: వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా?

|

Nov 01, 2024 | 4:26 PM

Vehicle Number Plates: రోడ్లపై ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు వాహనాల నంబర్ ప్లేట్లు కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు నలుపు, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇలాంటి రంగుల నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి కలర్స్‌లో నంబర్ ప్లేట్స్‌ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

Vehicle Number Plates: వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా?
Follow us on

రోడ్లపై ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు వాహనాల నంబర్ ప్లేట్లు కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు నలుపు, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇలాంటి రంగుల నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి కలర్స్‌లో నంబర్ ప్లేట్స్‌ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

నెంబర్ ప్లేట్లలో రకాలు:

  • తెలుపు రంగు
  • ఆకుపచ్చ రంగు
  • పసుపు రంగు
  • ఎరుపు రంగు
  • నీలం రంగు
  • నలుపు రంగు
  • బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్

తెల్లని నంబర్ ప్లేట్

సాధారణ పెట్రోల్, డీజిల్‌తో కూడిన ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ వైట్ నంబర్ ప్లేట్‌లను జారీ చేస్తుంది. తెలుపు నంబర్‌ ప్లేటుపై నలుపు అక్షరాలు ఉంటాయి. ఈ నంబర్లు వ్యక్తిగత వినియోగ వాహనాలు, బైక్‌లు, స్కూటర్‌ల కోసం ఉపయోగిస్తుంటారు.

ఆకుపచ్చ నంబర్ ప్లేట్

ఈ రంగు నంబర్ ప్లేట్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం ఈ రంగు నంబర్ ప్లేట్‌లను రిజర్వ్ చేసింది. దేశంలో రిజిస్టర్ అయిన అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్లు మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల ప్లేట్లు తెలుపు రంగులో ఉంటాయి. వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటాయి.

పసుపు నంబర్ ప్లేట్:

ఆటో రిక్షాలు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు, జెసిబిలు వంటి వాణిజ్యపరంగా ఉపయోగించే వాహనాలపై ఈ రంగు నంబర్ ప్లేట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే, పసుపు నంబర్ ప్లేట్‌లతో వాహనాలను నడపడానికి, డ్రైవర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ కోసం వాడే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్‌ను ఇస్తారు.

నలుపు నంబర్ ప్లేట్

బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఇతర వాహనాల కంటే తక్కువగా కనిపిస్తాయి. ఈ వాహనాలను వాణిజ్యపరంగా కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ వాహనాలు నడపడానికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. విలాసవంతమైన హోటల్‌ రవాణాకు నల్లటి నంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాలను వినియోగిస్తున్నారు.

నీలం రంగు నెంబర్ ప్లేట్:

నీలం రంగు నెంబర్ ప్లేట్.. దాని మీద అక్షరాలు తెలుపు రంగులో ఉంటే అది విదేశీ దౌత్యవేత్తల వాహనం అని అర్థం. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ వ్యక్తులు కోసం ఈ వాహనాలను వాడతారు. CC- కాన్సులర్ కార్ప్స్, UN- యునైటెడ్ నేషన్స్, DC- డిప్లొమాటిక్ కార్ప్స్ వంటి వాళ్లకి ఈ రంగు నంబర్ ప్లేట్‌లను ఇస్తారు.

బాణం నంబర్ ప్లేట్

సైన్యానికి చెందిన వాహనాల్లో మాత్రమే ఈ తరహా నంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. రక్షణ వాహనాల నంబర్ ప్లేట్‌లు పైకి చూపే బాణం కలిగి ఉంటాయి. ఇలాంటి నంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాలకు టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎరుపు రంగు నెంబర్ ప్లేట్:

జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నెంబర్ ప్లేట్.. రాష్ట్ర గవర్నర్ ఉపయోగించే వాహనాలకు ఈ విధమైన నంబర్ ప్లేట్ ఉంటుంది. ఒకవేళ జాతీయ చిహ్నం బంగారు రంగులో ఉన్నట్టయితే అది రాష్ట్రపతికి చెందిన వాహనం అని అర్థం.

ఇది కూడా చదవండి: Gold Buying: భారత్‌లో బంగారం కొనుగోళ్లు ఎందుకు పెరిగాయి? చైనాను అధిగమించిన ఇండియా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి