ప్రస్తుతం డిజిటల్ యుగంలో యూపీఐ మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. రెస్టారెంట్‌లో షాపింగ్ చేయడానికి లేదా భోజనానికి చెల్లించాలన్నా మనలో చాలా మంది ఆన్‌లైన్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఈ లావాదేవీలు ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడి ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోతే మన యూపీఐ చెల్లింపులకు అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇంటర్నెట్ లేకుండాన యూపీఐ చెల్లింపులను చేయవచ్చని చాలా మందికి తెలియదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యూపీఐ చెల్లింపులను అనుమతించే కొత్త సేవను ప్రవేశపెట్టింది.
యాక్టివ్ ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ సేవలను అధికారిక యూఎస్ఎస్‌డీ సర్వీస్‌ను ఉపయోగించి యూపీఐ సేవలను పొందవచ్చు. *99# డయల్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వినియోగదారులు ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీలు, ఖాతా నిల్వలను తనిఖీ చేయడం, యూపీఐ పిన్‌లను సెట్ చేయడం లేదా మార్చడం వంటి వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్సెస్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి