
బంగారంతో పోలిస్తే వెండి ధరలు ఊహించని విధంగా పడిపోతున్నాయి. గోల్డ్‌తో పోలిస్తే సిల్వర్ ధరలు భారీగా డౌన్ అవుతున్నాయి. బంగారం ధర నెమ్మదిగా తగ్గుతుండగా.. సిల్వర్ మాత్రమే రోజురోజుకి మరింత పతనమవుతోంది. ఈ విలువైన లోహం దాని ఆల్ టైం రికార్డ్ ధర కంటే కూడా చౌకగా మారింది. ఈ ఏడాది జనవరి 29వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో వెండి ధర కిలోకు రూ.4,20,048 గరిష్ట స్థాయికి చేరుకుని కొత్త చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత నుంచి ఘోరంగా పడిపోతున్న సిల్వర్ ధరలు.. ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు బంగారం కంటే సిల్వర్ వేగంగా స్పందిస్తుంది.
నవంబర్ 25వ తేదీన కిలో సిల్వర్ ధర రూ.1.65 లక్షల వద్ద కొనసాగుతోంది. జనవరిలో రూ.4.20 లక్షల గరిష్ట స్థాయితో పోలిస్తే రూ.10 నెలల్లోనే రూ.2.55 లక్షల మేర దిగొస్తుంది. ఇది ఎవరూ ఊహించని భారీ పతనంగా చెప్పవచ్చు. ఈ నెలలో చూసుకుంటే నవంబర్ 16న కిలో సిల్వర్ రూ.1.90 లక్షల వద్ద ఉంది. అక్కడి నుంచి ప్రతీ రోజు క్రాష్ అవుతూనే వస్తోంది. నవంబర్ 18న రూ.1.85 లక్షలకు చేరుకోగా.. నవంబర్ 19న రూ.1.80 లక్షలకు కప్పకూలింది. ఆ తర్వాత నవంబర్ 20న రూ.1.75 లక్షలకు దిగిరాగా.. నవంబర్ 25వ తేదీన ఒకేసారి రూ.10 వేలు పడిపోవడంతో రూ.1.65 లక్షల వద్ద కొనసాగుతోంది. ఈ 10 రోజుల్లో రూ.25 వేలు తగ్గిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరటను కలిగిస్తోంది . పెళ్లిళ్ల సమయంలో మెట్టెలు, పూజా సామాగ్రి, దేవుడి ప్రతిమలు రూపంలో సిల్వర్ కొంటూ ఉంటారు. ధరలు తగ్గడం వారికి ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. సిల్వర్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ మౌలిక సదుపాయాల్లో సిల్వర్ వినియోగం తగ్గింది. అంతర్జాతీయ స్థాయిలో చైనా ఎక్కువగా వెండిని దిగుమతి చేసుుంటూ ఉంటుంది. కానీ చైనా కూడా దిగుమతి చేసుకోవడం భారీగా తగ్గించింది. దీని వల్ల డిమాండ్ పడిపోవడంతో సిల్వర్ ధరలు భారీ పతనం దిశగా వెళ్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక కారణాలు కూడా వెండి ధరల పతానానికి కారణమవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లో మార్కెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. డిసెంబర్ 5న జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర మార్గాల వైపు మళ్లుతున్నారు. ఇది పసిడిపై అమ్మకాల ఒత్తిడిని పెంచుతోంది.