State Bank Of India: SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ లోన్ తీసుకునేవారికి బంపర్ ఆఫర్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కట్టుకొవాలనుకునేవారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది.

State Bank Of India: SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ లోన్ తీసుకునేవారికి బంపర్ ఆఫర్..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 4:02 PM

State Bank Of India:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కట్టుకొవాలనుకునేవారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కల కూడా నెరవేరనుంది. మరీ ఆ ఆఫర్ ఎంటో తెలుసుకుందామా..

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్ వడ్డీ రైట్లపై 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ అందిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ భారీ ఆఫర్లతో హోం లోన్ తీసుకునే వారికి మంచి అవకాశాలు కలగనున్నాయి. ఇక ఎస్‏బీఐలో రూ.30 లక్షల వరకు హోం లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.8 శాతం ఉంటుంది. అవికాకుండా రూ.30 లక్షలకు పైగా హోం లోన్ తీసుకుంటే 6.95 శాతం వడ్డీకే లోన్ వస్తుంది. హోంలోన్ వడ్డీ ట్లు సిబిల్ స్కోర్‏తో లింక్ అయి ఉండనుంది. అంతేకాకుండా రూ.5 కోట్ల వరకు హోం లోన్‏కు 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఇక 8 మెట్రో నగరాల్లో ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుందని.. అలాగే మహిళలు తీసుకునే హోంలోన్లలో 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు ఉంటుందని ఎస్‏బీఐ పేర్కోంది. ఇక ఎస్‏బీఐ యోనో యాప్ ద్వారా లోన్ తీసుకుంటే 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు లభిస్తుందని తెలిపింది.

Also Read: SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ రుణాలపై బంపర్ ఆఫర్స్… వారికి మాత్రమే ఛాన్స్..

SBI Home Rates: కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై రాయితీ.!