Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

|

Mar 19, 2021 | 8:20 AM

Financial Dates: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. దీంతో ఆ రోజు నుంచి పలు అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందువల్ల మార్చి నెల ..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..
Financial Dates
Follow us on

Financial Dates: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. దీంతో ఆ రోజు నుంచి పలు అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందువల్ల మార్చి నెల వచ్చిందంటే ప్రజలు కొత్త నిబంధనలపై తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. గత సంవత్సరం కరోనా మహహ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానించడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ప ఎంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో ప్రతి ఒక్కరు ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి 31వ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రతి ఒక్కరూ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మార్చి 31లోగా చేసే పనులు..

పాన్‌కార్డు ఆధార్‌ లింక్‌

పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు లింక్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు పొడిగించింది. ముందుగా చాలా డెడ్‌లైన్లు పెట్టినప్పటికీ, చివరగా దీనిని 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఈలోగా మీ పాన్‌ నెంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేయకపోతే ఆ నెంబర్‌ పని చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపడం కుదరదు. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌

ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు మార్చి 31 వరకు మీ బిల్లులను సరైన ఫార్మాట్‌లో ప్రభుత్వానికి అందజేయాలి. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్‌ నెంబర్‌ వంటి వాటిని పేర్కొనాలి. ఈ పథకాన్ని 2020 అక్టోబర్‌ నెలలో కేంద్ర సర్కార్‌ ప్రకటించింది.

ఐటీఆర్‌ ఫైలింగ్‌

2019-20 ఆర్థిక ఏడాదికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే భారీ ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి, తొందరగా ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒక వేళ గడువు దాటిన తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేస్తే రూ.10వేల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 లక్షల ఆదాయం వరకు ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తమై మార్చి 31లోగా మీ ఐటీఆర్‌ దాఖలును పూర్తి చేసుకుంటే మంచిది.

డబుల్ టాక్సేషన్​ నివారణకు డిక్లరేషన్​

కోవిడ్‌-19 కారణంగా చాలా మంది విదేశీ పౌరులు, ప్రవాసీయులు భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించిన ఆదాయంపై డబుల్‌ టాక్సేషన్‌ కట్టాల్సి వస్తోంది. అటువంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్‌ సమర్పించి డబుల్‌ టాక్సేషన్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపింది. 2021 మార్చి 3న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ విడుదల చేసినదాని ప్రకారం.. డబుల్‌టాక్స్‌ను ఎదుర్కొంటున్నవారు ఫారం-NRలో ఆయా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

వివాద్‌ సే విశ్వాస్‌

2020 మార్చి 17న అమల్లోకి వచ్చిన వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం డిక్లరేషన్‌ దాఖలు చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పెండింగ్‌లో ఉన్న ఆదాయపను పన్ను తగ్గించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31లోపు ఈ పనులు చేసుకుంటే మంచిది.

అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం

కేంద్ర ప్రభుత్వం అత్యవసర క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్ని ప్రకటించింది. అయితే స్వాలంబన ఇండియా ప్యాకేజీని ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రుణాలు అందించింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారులను పునరుద్దరించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ రుణాలు తీసుకున్నవారుకూడా ఈనెల చివరి వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టులో భాగంగా 2020 మే 13న కేంద్రం ఈ అత్యవసర క్రెడిట్‌లైన్‌ హామీ పథకాన్ని ప్రకటించింది.

ఇవీ కూడా చదవండి :

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

Bank Locker Rules and Regulations: మీరు బ్యాంకులో లాకర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు