
క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ షాక్. ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త నిబంధనలతో వీటిని వాడేవారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు నియమాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఆదాయపు పన్ను నియమాలు 1962లో మార్పులు చేస్తూ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026ను ఆదాయపు పన్ను శాఖ తీసుకొస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ విడుదల అయిన విషయం తెలిసిందే.

కొత్తగా రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ క్రెడిట్ కార్డులు వాడేవారిపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. వీటి లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించడం, పెద్ద బిల్లులను పర్యవేక్షించడంపై ఐదు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో క్రెడిట్ కార్డుల నియామాలు పూర్తిగా మారనున్నాయి.

క్రెడిట్ కార్డుల బిల్లులు, లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా మరింత పెరగనుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు యూపీఐ, బ్యాంక్ బదిలీ లేదా చెక్ వంటి మర్గాల ద్వారా చెల్లిస్తే బ్యాంక్ లేదా కార్డు జారీ చేసిన సంస్థ ఆ లావాదేవీలను ఖచ్చితంగా ఐటీ శాఖకు చెప్పాల్సి ఉంటుంది. ఇక రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు నగదు రూపంలో చెల్లించినా బ్యాంకులు ఐటీ శాఖకు చెప్పాల్సి ఉంటుంది.

గతంలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు మరింత కఠినతరం చేశారు. ఇక పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇక నుంచి క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ధృవీకరణ కోసం సమర్పించవచ్చు. అయితే స్టేట్ మెంట్ మూడు నెలల కంటే పాతది అయి ఉండకూడదు. పాత స్టేట్‌మెంట్స్ చెల్లవు.

ఇక నుంచి కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయానికి పాన్ కార్డును తప్పనిసరి చేశారు. పాన్ కార్డు లేకుండా కొత్త క్రెడిట్ కార్డు బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థలు జారీ చేయకూడదు. కార్డు జారీ చేసేటప్పుడు పాన్ కార్డును పొందటంతో పాటు పరిశీలన చేపట్టాలి.