AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC: ఏసీ, కూలర్ లేకుండానే ఇల్లంతా చల్ల.. చల్లగా..! పేదోడికి ఇక కరెంటు బిల్లుతో పన్లేదు..

వేసవిలో ఏసీలు, కూలర్లు లేకపోయినా మన ఇంటిని, ఒంటిని ఎలా చల్లగా ఉంచుకోవాలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు వివరించారు. ఒట్టివేళ్ల చాపల ద్వారా నాచురల్ కూలింగ్ పొందడం, సరైన పద్ధతిలో మంచినీరు తాగి వడదెబ్బ నుంచి ఎలా తప్పించుకోవాలో ఇలా చూడండి.

AC: ఏసీ, కూలర్ లేకుండానే ఇల్లంతా చల్ల.. చల్లగా..! పేదోడికి ఇక కరెంటు బిల్లుతో పన్లేదు..
Natural Ways Cooling
Ravi Kiran
|

Updated on: May 04, 2026 | 5:29 PM

Share

ఈ వేసవిలో ఎండలు భయంకరంగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఎండ వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏసీలు, కూలర్లు లేని వారు కూడా తక్కువ ఖర్చుతో ఇంటిని చల్లబరుచుకునే అద్భుతమైన మార్గాలను డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు వివరించారు. మంతెన చెప్పిన దాని ప్రకారం, మన ఇంటిని న్యాచురల్‌గా కూల్ చేయడానికి ‘ఒట్టివేళ్ల చాపలు’ ప్రాణవాయువు లాంటివి. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఒట్టివేళ్లు తమ బరువు కంటే 2-3 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. కిటికీలకు లేదా గుమ్మాలకు ఈ చాపలు కట్టి, వాటిని నీటితో తడపాలి. వీటి ద్వారా వచ్చే గాలి బయటి ఉష్ణోగ్రత కంటే ఇంటి లోపల 4-5 డిగ్రీల వరకు తగ్గిస్తుంది.

ఏసీల వల్ల వచ్చే కృత్రిమ గాలి కంటే, ఒట్టివేళ్ల నుంచి వచ్చే ఔషధ గుణాలు కలిగిన గాలి మన ఒంటికి ఎంతో మంచిది. ఒక చిన్న చిట్కా ఏమిటంటే, నీటి కుండకు కూడా ఒట్టివేళ్ల చాప ముక్కలను చుడితే, నీరు మరింత చల్లగా ఉంటుంది. అలాగే ఆటోలు, వాహనాలపైన వీటిని వేయడం వల్ల ఎండ వేడి నేరుగా వాహనం లోపలికి రాకుండా ఉంటుంది.

ఒంటిని చల్లబరిచే అసలైన మార్గం..

చాలామంది వేడి చేసినప్పుడు ఐస్ వాటర్ లేదా చల్లటి కూల్ డ్రింక్స్ తాగుతారు. మనం తాగే చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతకు(98.4 F) సమానంగా వేడెక్కితే తప్ప రక్తంలోకి వెళ్లదు. అందుకే బాడీని లోపల నుంచి చల్లబరచడానికి..

మంచినీరే అసలైన మందు: రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. మనం ఎంత చెమట రూపంలో నీటిని కోల్పోతామో, అంతే మొత్తంలో తిరిగి భర్తీ చేయాలి.

హైడ్రేషన్ ముఖ్యం: వడదెబ్బ తగులుతోంది అంటే బాడీలో నీరు తక్కువైందని అర్థం. ఆహారం తినడానికి పావుగంట ముందు నీరు తాగితే, అది వెంటనే రక్తంలో కలిసి బాడీని హైడ్రేట్ చేస్తుంది.

ఇంటికి ఒట్టివేళ్ల చాపలు, ఒంటికి సరిపడా మంచినీరు.. ఈ రెండు సూత్రాలు పాటిస్తే ఎంతటి కఠినమైన వేసవినైనా మనం సులభంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించడం ఎంతో అవసరం.

Also Read: 

ఏసీ కూలింగ్ ఎక్కట్లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. దాన్ని ఓపెన్ చేయగా బిత్తరపోయారు..

మీరు ఏసీ వాడినా కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా.? రిమోట్‌తో ఇలా చేస్తే చాలు.. సింపుల్ చిట్కాలు

Follow Us