
Silver Price: బంగారంలాగే భారతదేశంలో వెండి కూడా అత్యధికంగా అమ్ముడయ్యే, ఇష్టపడే పెట్టుబడి మార్గాలలో ఒకటి. వెండిని నాణేలు, బిస్కెట్లు (Bars), ఆభరణాలు, విగ్రహాలు, వెండి పాత్రల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వచ్చింది.
మార్చి 1వ తేదీన కిలో వెండి ధర రూ.3 లక్షల వరకు ఉండేది. అదే మార్చి 15వ తేదీన రూ.2,75,000లకు దిగి వచ్చింది. అదే మార్చి 20వ తేదీన కిలో సిల్వర్ ధర రూ.2,55,000 వరకు చేరుకుంది. అలగే మార్చి 31వ తేదీన రూ.2,50,000 వద్దకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో కాస్త పెరుగుదల , తగ్గుదలలు చోటు చేసుకున్నాయి. అయితే పెరగడం కంటే తగ్డమే భారీగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అదే ధరతో ట్రేడవుతోంది. మొత్తం మీద మార్చి 1 నుంచి ఇప్పటి వరకు వెండి ధరను పరిశీలిస్తే కిలోపై ఏకంగా రూ.50,000 వరకు దిగి వచ్చింది.
ఇది కూడా చదవండి: Success Mantra: మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
బంగారం ధరల వలె వెండి ధరలు కూడా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. డిమాండ్, సరఫరా: పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో వెండికి డిమాండ్ పెరుగుతుంది. అలాగే పారిశ్రామిక ఉత్పత్తిలో వెండిని ఎక్కువగా వాడటం వల్ల కూడా ధరలు పెరుగుతాయి.
గ్లోబల్ మార్కెట్: అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ తగ్గినా లేదా క్రూడ్ ఆయిల్ ధరలు మారినా వెండి ధరలపై ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు, రూపాయి విలువ పడిపోయినప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా ఉన్నా, భారత మార్కెట్‌లో ధర పెరుగుతుంది. అయితే ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి సుంకాలు (Import duties), అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా వెండి ధరలను మారుస్తుంటాయి. పెట్టుబడి పరంగా వెండి.. బంగారంతో పోలిస్తే ధర తక్కువగా ఉన్నప్పటికీ, పెట్టుబడికి ఇది సురక్షితమైన మార్గం. వెండి ఆభరణాలు లేదా నాణేలను అత్యవసర సమయంలో తిరిగి అమ్ముకున్నా మంచి ధర లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?
ఇది కూడా చదవండి: D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!
ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ భారీ విరాళం.. ఆ ఆలయానికి రూ.18 కోట్లు.. ఏనుగుల కోసం కూడా..!
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి