LPG Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సిలిండర్ కేవలం 750 రూపాయలకే ! ఆలస్యం ఎందుకు త్వరగా బుకింగ్ చేసుకోండి..

|

Sep 14, 2022 | 10:43 AM

LPG Cylinder:వంటింటి మహిళలకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌కు ఎక్కువ డబ్బులు అవుతున్నాయని చింతిస్తున్నారా.. ఇక ఆ చింత ఆవసరం లేదు. కేవలం రూ.750కే గ్యాస్ సిలిండర్ లభించబోతోంది. మీరు ఇప్పటి వరకు చెల్లిస్తున్న సాధారణ సిలిండర్ ధర కంటే రూ. 300 తక్కువకు లభిస్తుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

LPG Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సిలిండర్ కేవలం 750 రూపాయలకే ! ఆలస్యం ఎందుకు  త్వరగా బుకింగ్ చేసుకోండి..
Lpg Gas Cylinder
Follow us on

గత కొద్ది రోజులుగా ద్రవ్యోల్బణం చాలా వేగంగా పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రభావం నేరుగా సామాన్య ప్రజానికంపై పడుతోంది. అయితే ముఖ్యంగా వంటింటిపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తోంది. LPG ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉన్నా.. ఇప్పటికే పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో కొంత ఇబ్బంగా ఫీలవుతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యికి పైగానే ఉంది. ఇలాంటి సమయంలో, మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో మీ ఇంటికి కొత్త గ్యాస్ కనెక్షన్‌ని పొందాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ఇండేన్ తన వినియోగదారుల కోసం చాలా ఆకర్షణీయమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

వాస్తవానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ ఇండేన్ వినియోగదారుల సౌకర్యార్థం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని కింద తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్‌ను పొందవచ్చు. Indane ఈ కొత్త ప్లాన్‌తో మీరు కేవలం 750 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు. అంటే సాధారణ ధర కంటే దాదాపు రూ.300 తక్కువ ధరకే ఈ గ్యాస్ సిలిండర్ మీకు లభిస్తుంది.

దీని ప్రత్యేకత ఏమిటంటే..

సామాన్యుల కోసం ఇండేన్ కంపెనీ ప్రారంభించింది. ఈ సిలిండర్ బరువు సాధారణ సిలిండర్ కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల దాని ధర కూడా తక్కువే. ఈ సిలిండర్‌ను కేవలం రూ.750కే కొనుగోలు చేయవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. మీరు దీన్ని సులభంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు.

ప్రస్తుతం ఈ సదుపాయం 28 నగరాల్లో మాత్రమే..

ఇండేన్ ప్రస్తుతం 28 నగరాల్లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. త్వరలో దీన్ని విస్తరించి, అన్ని నగరాల్లో ఈ సిలిండర్ అందుబాటులోకి రానుంది.  

మరిన్ని బిజెనెస్ వార్తల కోసం