Voter ID Download: మీ ఓటర్ ఐడీ కార్డు పోగొట్టుకున్నారా..? ఫోన్‌లోనే చిటికెలో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఓటర్ ఐడీ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్. ఓటు కోసమే కాకుండా ఒక గుర్తింపు పత్రంగానూ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ కార్డు పోతే సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి నుంచే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Voter ID Download: మీ ఓటర్ ఐడీ కార్డు పోగొట్టుకున్నారా..? ఫోన్‌లోనే చిటికెలో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Voter Id Download

Updated on: Nov 02, 2026 | 1:28 PM

ఓటర్ ఐడీ అనేది దేశ పౌరులకు అవసరమైన అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా పలు సేవల పొందేందుకు ఒక గుర్తింపు డాక్యుమెంట్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంతో ఓటర్ ఐడీ కార్డు అనేది మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవడం మంచిది. అయితే మీ ఓటర్ ఐడీ కార్డు పోగొట్టుకుంటే ఆన్‌లైన్ ద్వారా సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే మీ మొబైల్ ద్వారా డిజిటల్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం.

ఓటర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..

– ECI అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.inను సందర్శించండి

-వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కొద్దిగా క్రిందికి స్క్రోల్ చేస్తే “e-EPIC Download” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

-మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. లేదంటే కొత్త యూజర్‌గా రిజిస్టర్ చేసుకోండి.

-మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి “Request OTP” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

-మీ మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

-అనంతరం మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్‌ను (EPIC నంబర్) ఎంటర్ చేయండి

-ఆ తర్వాత మీ రాష్ట్రం, డేట్ ఆఫ్ బర్త్, నియోజకవర్గం, గ్రామం వివరాలను నమోదు చేయండి

-మీ వివరాలను నమోదు చేసిన తర్వాత, “Search” బటన్‌పై క్లిక్ చేయండి

-మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్, మీ పేరు, తండ్రి లేదా తల్లి పేరు, మీ మొబైల్ నంబర్‌తో సహా  వివరాలన్నీ కనిపిస్తాయి

– మీకు అక్కడ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయడం ద్వారా ఓటర్ ఐడి కార్డ్ PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది

ఇది తప్పనిసరి..

మీ ఓటర్ ఐడీ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మొబైల్ నంబర్ ECI రికార్డులలో ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి. స్క్రీన్‌పై మీ మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలు కనిపిస్తే మీది లింక్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ నంబర్ లింక్ చేయబడకపోతే ఫారం 8ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలంటే వెబ్ సైట్లో బీఎల్‌ఓతో పాటు ఉన్నతాధికారుల వివరాలు కనిపిస్తాయి. వారికి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us