Car Discounts: కార్లపై ఆఫర్ల వర్షం.. ఏకంగా 1.5లక్షల వరకూ భారీ తగ్గింపులు.. త్వరపడండి..

మీరు ఏదైనా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. దాదాపు నాలుగేళ్ల తర్వాత, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆటో పరిశ్రమలో డిస్కౌంట్ల వర్షం కురుస్తోంది. గత కొంత కాలంగా అతి తక్కువ యాడ్ ఆన్ ప్రయోజనాలతోనే చిన్న ఆఫర్లను కార్ల కంపెనీలు ప్రకటించాయి. కానీ ఇప్పుడు భారీ డిస్కౌంట్లను అన్ని టాప్ బ్రాండ్లు అందిస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది.

Car Discounts: కార్లపై ఆఫర్ల వర్షం.. ఏకంగా 1.5లక్షల వరకూ భారీ తగ్గింపులు.. త్వరపడండి..
Cars
Follow us

|

Updated on: Jul 01, 2024 | 4:47 PM

మీరు ఏదైనా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. దాదాపు నాలుగేళ్ల తర్వాత, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆటో పరిశ్రమలో డిస్కౌంట్ల వర్షం కురుస్తోంది. గత కొంత కాలంగా అతి తక్కువ యాడ్ ఆన్ ప్రయోజనాలతోనే చిన్న ఆఫర్లను కార్ల కంపెనీలు ప్రకటించాయి. కానీ ఇప్పుడు భారీ డిస్కౌంట్లను అన్ని టాప్ బ్రాండ్లు అందిస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. దీని ప్రకారం పాత మారుతి సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ. 50,000 వరకూ క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ లాయల్టీ, ఎక్స్‌ఛేంజ్ సిటీ ప్రోగ్రామ్‌ల వంటి వాటితో అందిస్తోంది. ఎఫ్ఏడీఏ నుండి వచ్చిన అదనపు డేటా ప్రకారం , మారుతి సుజుకి ఆల్టో కే10 రూ. 42,000 (మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌పై గరిష్టంగా) వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే మరికొన్ని హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లపై అధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌పై ప్రయోజనాలు రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 18,000 నుంచి రూ. 35,000 వరకు ఉంటాయి. హ్యుందాయ్ ఆరా రూ. 23,000 నుంచి రూ. 40,000 ప్రయోజనాలతో వస్తుంది. హోండా అమేజ్ రూ. 40,000 (ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో సహా) పొందుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా..

అధిక ధర కలిగిన ఈవీలు, ఎస్‌యూవీలు కూడా తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. హ్యుందాయ్ అల్కాజార్‌పై రూ. 45,000 నుంచి రూ. 65,000 తగ్గింపు, మహీంద్రా ఎక్స్ యూవీ400 ఈవీపై రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనాలు, హోండా సిటీ ఈహెచ్ఈవీపై రూ. 65,000 తగ్గింపు లభిస్తోంది. అయితే మహీంద్రా థార్ వంటి కొన్ని మేక్‌లు, మోడల్‌లు ఇప్పటికీ వెయిట్‌లిస్ట్‌లో ఉన్నాయి. మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్, ఎర్టిగా వంటి వాటిపై ఎటువంటి తగ్గింపులు లేవు.

అకస్మాత్తు తగ్గింపులకు కారణం ఏమిటి?

సాధారణంగా ఫెస్టివల్ సీజన్లో ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం కామన్. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భారీ డిస్కౌంట్లను ప్రకటించడం వెనుక కారణాల గురించి ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ సాధారణంగా జూన్, జూలై నెలల్లో సేల్స్ చాలా తక్కువగా ఉంటాయని.. ఈ నేపథ్యంలో కాస్తయిన సేల్స్ పెంచుకునేందుకు ఈ డిస్కౌంట్లను ఎక్కువగా ప్రకటించారని చెబుతున్నారు. ఆటో పరిశ్రమ నిపుణులు రిటైల్ ధరలో తగ్గింపుల పరంగా, చిన్న కార్లు కుప్పలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. ఆల్టో, బొలెరో నియో, ఎస్. -ప్రెస్సో, సెలెరియో, ఇగ్నిస్ అత్యధిక డిస్కౌంట్-టు-ప్రైస్ పర్సంటైల్‌ను కలిగి ఉన్నాయని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

‘నీట్‌ యూజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం'.. ప్రధాని మోదీ
‘నీట్‌ యూజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం'.. ప్రధాని మోదీ
'టాప్' లేపేసిన టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్.. కోహ్లీ, రోహిత్ సంగతి
'టాప్' లేపేసిన టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్.. కోహ్లీ, రోహిత్ సంగతి
మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయాలంటే సింపుల్ టిప్స్ మీ కోసం
మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయాలంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఈ ఆకులను తక్కువ అంచానా వేయకండి.. ఖాళీ కడుపుతో రెండు తింటే..
ఈ ఆకులను తక్కువ అంచానా వేయకండి.. ఖాళీ కడుపుతో రెండు తింటే..
కర్ణాటక - ఆంధ్రా సరిహద్దులో తుపాకీ కాల్పుల కలకలం..!
కర్ణాటక - ఆంధ్రా సరిహద్దులో తుపాకీ కాల్పుల కలకలం..!
ఈ తప్పులు చేస్తే షుగర్‌‌ని అస్సలు కంట్రోల్ చేయలేం!
ఈ తప్పులు చేస్తే షుగర్‌‌ని అస్సలు కంట్రోల్ చేయలేం!
స్నేహితులతో గడపాలంటూ హీరోయిన్‏కు భర్త టార్చర్..
స్నేహితులతో గడపాలంటూ హీరోయిన్‏కు భర్త టార్చర్..
గత DSCకి దరఖాస్తు చేసుకున్నవారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు
గత DSCకి దరఖాస్తు చేసుకున్నవారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు
అంత్యక్రియలు ఆపేసి మరీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ..
అంత్యక్రియలు ఆపేసి మరీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసిన ఫ్యామిలీ..
బరాత్‌ల పేరుతో హంగామా.. ఖాజీల కీలక నిర్ణయం..!
బరాత్‌ల పేరుతో హంగామా.. ఖాజీల కీలక నిర్ణయం..!