2026 సేఫ్టీ రిపోర్ట్: భారత్‌లో 5-స్టార్ రేటింగ్ కొట్టిన అత్యంత సురక్షితమైన కార్లు ఇవే!

మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా 2026 నాటికి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాదిలో కఠినమైన క్రాష్ టెస్టులను తట్టుకుని, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ విభాగాలలో 5-స్టార్ రేటింగ్ సాధించిన అత్యంత సురక్షితమైన కార్ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

2026 సేఫ్టీ రిపోర్ట్: భారత్‌లో 5-స్టార్ రేటింగ్ కొట్టిన అత్యంత సురక్షితమైన కార్లు ఇవే!
Cars

Updated on: Nov 24, 2026 | 8:17 PM

మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా 2026 నాటికి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కారు కొనాలంటే ముందుగా ‘మైలేజ్ ఎంత ఇస్తుంది?’ అని అడిగేవారు. కానీ పెరుగుతున్న రహదారి ప్రమాదాల దృష్ట్యా, ఇప్పుడు కొనుగోలుదారులు మైలేజ్, లగ్జరీ ఫీచర్ల కంటే ‘కారు బిల్డ్ క్వాలిటీ మరియు సేఫ్టీ రేటింగ్’ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ NCAP(BNCAP), గ్లోబల్ NCAP (GNCAP) క్రాష్ టెస్టుల రాకతో ఆటోమొబైల్ కంపెనీల మధ్య సేఫ్టీ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో 2026లో కఠినమైన క్రాష్ టెస్టులను తట్టుకుని, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ విభాగాలలో 5-స్టార్ రేటింగ్ సాధించిన అత్యంత సురక్షితమైన కార్ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

5-స్టార్ రేటింగ్ కొట్టిన అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

1. టాటా హారియర్ & హారియర్ EV..

మిడ్-సైజ్ SUV విభాగంలో టాటా హారియర్ సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. భారత్ NCAP క్రాష్ టెస్టులలో హారియర్ EV అడల్ట్ సేఫ్టీ విభాగంలో ఏకంగా 32/32 పూర్తి పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది. ల్యాండ్ రోవర్ D8 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన OMEGARC ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించడం వల్ల దీనికి అత్యుత్తమ బాడీ స్ట్రక్చర్ లభించింది. ఇందులో 6 నుండి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, ESC వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. మహీంద్రా XEV 9e & BE 6..

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా సంస్థ సేఫ్టీ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. మహీంద్రా XEV 9e భారత్ NCAP టెస్ట్‌లో 32/32 పాయింట్లు, BE 6 మోడల్ 31.97/32 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రమాద సమయంలో బ్యాటరీ ప్యాక్‌కు ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యేక రక్షణ కవచాన్ని ఇందులో ఏర్పాటు చేశారు.

3. 2026 కియా సెల్టోస్..

2026లో ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచిన కారు కొత్త తరం కియా సెల్టోస్. గతంలో తక్కువ రేటింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్న సెల్టోస్, 2026లో సరికొత్త అప్‌డేట్‌తో భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 31.70/32 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. పెట్రోల్/డీజిల్ (ICE) కార్ల విభాగంలో అత్యధిక సేఫ్టీ స్కోరు సాధించిన కారుగా ఇది నిలిచింది.

4. మారుతి సుజుకి డిజైర్ & విక్టోరిస్..

మారుతి కార్ల బిల్డ్ క్వాలిటీపై ఉన్న అపోహలను చెరిపేస్తూ కొత్త తరం మారుతి డిజైర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి బెస్ట్ ఫ్యామిలీ సెడాన్‌గా నిలిచింది. దీనితో పాటు మారుతి విక్టోరిస్ (Victoris) మరియు ఇ-విటారా (e Vitara) కూడా భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్‌తో సత్తా చాటాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించడం వీటి ప్రత్యేకత.

5. టాటా పంచ్ & పంచ్..

బడ్జెట్ ధరలో 5-స్టార్ సేఫ్టీ కోరుకునే వారికి టాటా పంచ్ మరియు పంచ్ EV ఇప్పటికీ మొదటి ఎంపిక. 2026లో అప్‌డేట్ అయిన మోడల్స్ కూడా భారత్ NCAP టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను నిలబెట్టుకున్నాయి. నగర ప్రయాణాలకు, చిన్న కుటుంబాలకు ఇది అత్యంత సురక్షితమైన మైక్రో SUV.

కారు కొనే ముందు చెక్ చేయాల్సిన సేఫ్టీ ఫీచర్లు..

బేస్ వేరియంట్ నుండే 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయో లేదో చూడండి.

కారు అదుపు తప్పకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్

ISOFIX మౌంట్స్: చిన్న పిల్లల సీట్లను సురక్షితంగా బిగించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

కారులోని ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉండేలా చూసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us