Indian Wedding: నవంబర్-డిసెంబర్ నెలల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని లక్షల కోట్ల ఖర్చో తెలుసా?

|

Sep 28, 2024 | 7:27 PM

పండుగల సీజన్ ముగియగానే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. భారతదేశంలో పెళ్లికి ఎంత సందడి ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఖరీదైన వివాహాలు ఎన్నో ఉంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి పెళ్లి ఖర్చులకు కూడా లోటు ఉండదు. చాలా సార్లు ప్రజలు తమ జీవితాంతం సంపాదనను..

Indian Wedding: నవంబర్-డిసెంబర్ నెలల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని లక్షల కోట్ల ఖర్చో తెలుసా?
Wedding
Follow us on

పండుగల సీజన్ ముగియగానే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. భారతదేశంలో పెళ్లికి ఎంత సందడి ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఖరీదైన వివాహాలు ఎన్నో ఉంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి పెళ్లి ఖర్చులకు కూడా లోటు ఉండదు. చాలా సార్లు ప్రజలు తమ జీవితాంతం సంపాదనను పెళ్లి కోసం ఖర్చు చేస్తారు. కొందరు అప్పులు కూడా తీసుకుంటారు. అక్టోబర్‌లో దుర్గాపూజ, నవరాత్రి, దీపావళి ముగిసిన తర్వాత, నవంబర్-డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఆ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి బయటకు వచ్చింది.

రెండు నెలల పాటు జరిగే ఈ పెళ్లికి మొత్తం రూ.4.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఒక భారతీయుడు తన పెళ్లికి రెట్టింపుల్లో ఖర్చు చేస్తాడని ఓ సర్వే చెబుతోంది. అయితే ఈ భారీ మొత్తం రెండు నెలల్లో ఎలా ఖర్చు అవుతుంది?

ఒక నివేదిక ప్రకారం, ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని అంచనా. భారతదేశంలో మతపరమైన, సామాజిక రంగాలలో బంగారం చాలా ముఖ్యమైనది. చాలామంది బంగారం కొనడాన్ని పెట్టుబడిగా చూస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price: భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళి నాటికి రికార్డ్‌ సృష్టించనుందా?

బంగారం డిమాండ్ పెరగడం ఇతర రంగాలపైనా ప్రభావం చూపుతుంది. హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ రంగం కూడా లాభపడింది. డిమాండ్ పెరగడంతో వివిధ కంపెనీల లాభాలు పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫలితంగా కంపెనీల షేర్ల ధర పెరుగుతుంది. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుంది.

ఇది కూడా చదవండి: Edible Oil Prices: పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి