Indian Railways: మీరు వెళ్లాల్సిన ట్రైన్ సడెన్‌గా రద్దయిందా..? రైల్వేశాఖ కొత్త రీఫండ్ రూల్స్..

రైల్వేశాఖ అనివార్య పరిస్థితుల్లో మీరు ప్రయాణించాల్సిన రైలు రద్దు చేసే హక్కు ఉంటుంది. ఇలాంటి సమయంలో బుకింగ్ చేసుకున్న టికెట్ ఏమవుతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. టికెట్ ఛార్జి పూర్తిగా రీఫండ్ అవుతుందా..? లేకపోతే క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. వాటికి సమాధానాలు ఇందులో చూద్దాం.

Indian Railways: మీరు వెళ్లాల్సిన ట్రైన్ సడెన్‌గా రద్దయిందా..? రైల్వేశాఖ కొత్త రీఫండ్ రూల్స్..
Train Ticket Cancellation R

Updated on: Oct 10, 2026 | 12:31 PM

ట్రైన్లలో రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వరదలు, భారీ వర్షాలు లాంటి ప్రకృతి వైఫరీత్యాలతో పాటు ప్రజల నిరసనలు, వివిధ సాంకేతిక కారణాలతో రైల్వేశాఖ సడెన్‌గా రైళ్లను రద్దు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రిజర్వేషన్ టికెట్ల సంగతి ఏంటని ప్రయాణికులు ఆందోళన పడుతుంటారు. రైల్వేశాఖ స్వయంగా వివిధ కారణాలతో ట్రైన్లను రద్దు చేస్తే.. మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా రైల్వేశాఖ టికెట్లన్నీ క్యాన్సిల్ చేసి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ అందిస్తుంది. ఈ నగదు ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఇందుకోసం టికెట్ డిపాజిట్ రసీదు(టీడీఆర్) దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు పొందినవారు మాత్రం రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లి నగదు పొందాల్సి ఉంటుంది.

పూర్తి రీఫండ్ పొందాలంటే..?

రైల్వేశాఖ రైళ్లను రద్దు చేస్తే మీ నుంచి ఒక్క రూపాయి కూడా టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ తీసుకోరు. టికెట్ ధర మొత్తం పూర్తిగా రీఫండ్ అవుతుంది. కొన్నిసార్లు రీఫండ్ అమౌంట్ వెంటనే అకౌంట్లో పడితే.. మరికొన్నిసార్లు 3 నుంచి 7 రోజులు పట్టవచ్చు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు పొందిన రద్దు చేసుకున్నవారికి కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా రీఫండ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందినవారు మీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ అకౌంట్ తెరిచి అందులో ట్రాన్సాక్షన్లు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టికెట్ రీఫండ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది. అయితే రైల్వేశాఖ ట్రైన్ రద్దు చేయని పక్షంలో ప్యాసింజర్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రూల్స్ మరోలా ఉంటాయి.

కొత్త క్యాన్సిలేషన్ రూల్స్

రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్ల సంగతి అలా ఉంచితే.. ప్యాసింజర్ తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి సంబంధించి క్యాన్సిలేషన్ రూల్స్‌లో రైల్వేశాఖ మార్పులు చేసింది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు వరకు కన్ఫర్మ్డ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే గరిష్ట రీఫండ్ గతంలో లభించేది. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువును 72 గంటలకు పెంచారు. అంటే గరిష్ట రీఫండ్ పొందాలంటే రైలు ప్రయాణానికి 72 గంటల ముందుగానే టికెట్‌ను రద్దు చేసుకోవాలి. రైలు బయల్దేరడానికి ముందు 72 గంటల నుండి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తారు. మిగతా 75 శాతం రీఫండ్ లభిస్తుంది. 24 గంటల నుండి 8 గంటల్లోపు రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ విధిస్తారు. మిగతా 50 శాతం రీఫండ్ లభిస్తుంది. రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎటువంటి రీఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది.

Loading...
Unable to load recommendations.
Follow Us