Hyundai IPO: హ్యుందాయ్ మోటార్స్‌కు షాక్.. భారీ తగ్గిన షేర్ డిమాండ్.. కారణమిదేనా?

హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ ఐపీవో కోసం ఇన్వెస్టర్లందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని షేర్లు పొంది భారీగా లిస్టింగ్ గెయిన్స్ సాధించాలని చూస్తున్నారు. హ్యుందాయ్ కంపెనీ ఐపీవో అక్టోబర్ 15న ప్రారంభమై 17న ముగుస్తుంది. అయితే ఊహించని విధంగా ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) భారీగా పడిపోయింది.

Hyundai IPO: హ్యుందాయ్ మోటార్స్‌కు షాక్.. భారీ తగ్గిన షేర్ డిమాండ్.. కారణమిదేనా?
Hyundai Ipo
Follow us

|

Updated on: Oct 11, 2024 | 6:34 AM

స్టాక్ మార్కెట్‌ను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కొన్ని స్టాక్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మరికొన్ని ఉన్నట్టుండి తగ్గిపోతాయి. కాబట్టి మార్కెట్ తీరుతెన్నులను పెట్టుబడిదారులు అర్థం చేసుకోవాలి. స్టాక్‌లను అమ్మాలన్నా, కొనాలన్నా స్పష్టత చాలా ముఖ్యం. వివిధ కంపెనీలు ఐపీవోకు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ లో సందడి నెలకొంటుంది. లావాదేవీలు జోరుగా సాగుతాయి. ఆయా కంపెనీల స్టాక్ లను కొనేందుకు పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ అక్టోబర్ 15వ తేదీన ఐపీవోకు రానుంది. రికార్డు స్థాయిలో దాదాపు రూ.28 వేల కోట్లు సేకరించాలని లక్ష్యగా పెట్టుకుంది. అయితే ఈ కంపెనీ అన్ లిస్టెట్ షేర్ ధర ఐపీవో కంటే ముందుగానే గణనీయంగా పడిపోయింది.

అక్టోబర్ 15న ప్రారంభం..

హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ ఐపీవో కోసం ఇన్వెస్టర్లందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని షేర్లు పొంది భారీగా లిస్టింగ్ గెయిన్స్ సాధించాలని చూస్తున్నారు. హ్యుందాయ్ కంపెనీ ఐపీవో అక్టోబర్ 15న ప్రారంభమై 17న ముగుస్తుంది. అయితే ఊహించని విధంగా ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) భారీగా పడిపోయింది. సెప్టెంబర్ చివరిలో రూ.570 గా ఉంది. గతవారం రూ.360 వద్ద నమోదైంది. అయితే కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను రూ.1865 – 1960గా ఫిక్స్ చేసినట్టు ప్రకటించిన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఐపీవో జీఎంపీ కేవలం రూ.147గా కొనసాగుతోంది. సెప్టెంబర్‌తో పోల్చితే దాదాపు 72 శాతం పతనమైంది.

పెరిగే అవకాశం..

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం హ్యుందాయ్ ఐపీవో షేర్లు కేవలం ఏడు శాతం లిస్టింగ్ గెయిన్స్ అందించే అవకాశం ఉంది. కానీ ఇది చాలా తక్కువ లాభమని చెప్పవచ్చు. అయితే జీఎంపీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్కెట్ తీరుతెన్నులను బట్టీ మారుతూ ఉంటుంది.

లాభాల బాట..

హ్యందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గే తమ కంపెనీ సామర్థ్యంపై నమ్మకం ఉందన్నారు. జీఎంపీ తప్పకుండా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.6,060 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోల్చితే దాదాపు 28.7 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.8 శాతం పెరిగి రూ.69,829 కోట్లకు చేరుకుంది.

ఐపీవో లక్ష్యాలు..

  • హ్యందాయ్ కంపెనీ ఐపీవోలో దాదాపు రూ.28 వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఆటోమేకర్ ఆఫర్ కోసం ఒక్కో షేర్ కు రూ.1865-1960 మధ్య ధరను నిర్ణయించింది. కంపెనీ విలువ రూ.1.6 లక్షల కోట్లు
  • పబ్లిక్ ఆఫర్ ను అక్టోబర్ 15న సబ్ స్క్రిప్షన్ కోసం తెరుస్తారు, 17న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 14న వేలం వేేస్తారు.
  • హ్యందాయ్ మోటార్ ఇండియాను 1996లో ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ విభాగాలలో 13 రకాల కారు మోడళ్లను విక్రయిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్