మీరు బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తన కొత్త 2025 మోడల్ SP125 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త SP125 అన్ని హోండా డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. హోండా 2025 మోడల్ SP125 బైక్ కొత్త OBD 2B కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. స్టైలిష్, సాంకేతికంగా అధునాతన బైక్‌ను కోరుకునే కొత్త యుగం కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది. కొత్త హోండా SP125 డ్రమ్ వేరియంట్ ధర రూ.91,771, డిస్క్ వేరియంట్ ధర రూ.1,00,284. కొత్త SP125 అన్ని హోండా డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
మంచి డిజైన్‌తో సమ్‌థింగ్ స్పెషల్:
2025 మోడల్ హోండా SP125 అనేక కొత్త డిజైన్‌తో వస్తుంది. కొత్త ట్యాంక్ కవర్, క్రోమ్ మఫ్లర్ కవర్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ దీనికి స్పోర్టీ అప్పీల్‌ని అందిస్తాయి. ఇది కాకుండా, LED హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే 5 ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది.
2025 మోడల్ హోండా SP125 బైక్ ఫీచర్స్:
కొత్త హోండా SP125 ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే.. ఇది 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్‌కు మద్దతు ఇస్తుంది. అంటే, మీరు మీ బైక్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు. నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్‌ల వంటి ఫీచర్‌లను ఉపయోగించవచ్చు. ఇది వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ని కూడా కలిగి ఉంది. అందుకే మీరు చాలా పనులను హ్యాండ్స్-ఫ్రీగా చేయవచ్చు. మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఉంది.
2025 మోడల్ హోండా SP125 బైక్ ఇంజిన్, పవర్:
హోండా కొత్త SP125 124 cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8 kW పవర్, 10.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. హోండా SP 125 ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా షార్ట్ స్టాప్‌ల వద్ద ఆటోమేటిక్‌గా ఇంజిన్‌ను ఆపివేస్తుంది. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Tea: ఈ చాయ్ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి.. ఈ గోల్డ్ స్ట్రాంగ్ టీ ఎక్కడ దొరుకుతుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి