పెట్టుబడిదారులు సరైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఎంచుకోవడం వల్ల మీ పొదుపుపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు పోటీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడిదారులు వారి ఆర్థిక లక్ష్యాలు, వయస్సు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఉండడంతో పాటు స్థిరమైన రాబడిని అందిస్తాయి. కాలక్రమేణా మీ పొదుపులను పెంచడంలో సహాయపడతాయి. అయితే పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారులు తెలివిగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో మూడు సంవత్సరాల కాలానికి రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో? ఓ సారి చూద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 6.75 శాతం వడ్డీ అందిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.25శాతం వార్షిక వడ్డీ అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.66,718 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 72,164 రాబడి వస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.69,432 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 74,915 రాబడి వస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తుంది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో సమానంగా వడ్డీ రేటును అందిస్తుంది. అందువల్ల మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.69,432 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 74,915 రాబడి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి