SBI Loan: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్‌లతో బ్యాంకు రుణం..!

|

Jul 24, 2022 | 4:28 PM

SBI Loan: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. బ్యాంకు ఖాతాదారులకు ఇప్పుడు నిమిషాల్లో డబ్బు..

SBI Loan: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. నాలుగు క్లిక్‌లతో బ్యాంకు రుణం..!
SBI
Follow us on

SBI Loan: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. బ్యాంకు ఖాతాదారులకు ఇప్పుడు నిమిషాల్లో డబ్బు పొందు సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 4 క్లిక్‌ల ద్వారా మీ ఖాతాకు డబ్బును బదిలీ చేసుకోవచ్చు.

బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్

ఇవి కూడా చదవండి

కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ సౌకర్యాన్ని బ్యాంక్ అందజేస్తోందని, అందులో మీరు నిమిషాల్లో మీ అవసరానికి అనుగుణంగా లోన్ తీసుకోవచ్చని బ్యాంకు వెల్లడించింది. కేవలం 4 క్లిక్‌లతో ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పొందవచ్చని తెలిపింది. YONO యాప్/ఆన్‌లైన్ SBI ద్వారా ఈ తక్షణ రుణాన్ని పొందవచ్చని వెల్లడించింది.

మీ రిజిస్టర్డ్ నంబర్ నుండి SMS చేయండి

ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరింత సమాచారం కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఒక SMS మాత్రమే చేయాలి. మీరు మీ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌ను కేవలం 4 క్లిక్‌లలో పొందవచ్చని బ్యాంక్ ట్వీట్‌లో తెలిపింది. ఇది కాకుండా మీరు YONO, OnlineSBI ద్వారా కూడా పొందవచ్చు. ఈ పని కోసం మీరు బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ పని పూర్తి చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే బ్యాంకు వెంటనే రుణాన్ని మంజూరు చేస్తుంది.

 


రుణం ఎలా పొందాలి?

ముందుగా YONO యాప్‌కి లాగిన్ కావాలి. ఆ తర్వాత Avail now పై క్లిక్ చేయండి. రుణ మొత్తాన్ని ఎంచుకోండి. చివరగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయండి. దీని తర్వాత బ్యాంకు మీ వివరాలను పరిశీలించి అర్హత ఉంటే డబ్బు మీ ఖాతాలో జమ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..