Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికన్ డాలర్ బలపడటం కూడా బంగారానికి ఒక సవాలుగా నిలుస్తుంది. డాలర్ బలపడటం వల్ల, ఇతర కరెన్సీలలో బంగారం కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు అది మరింత ఖరీదైనదిగా మారవచ్చు. ఇది అంతర్జాతీయ..

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Prices

Updated on: Oct 22, 2026 | 6:39 AM

Gold Price Today: బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రికార్డు స్థాయిలో ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయనే చెప్పాలి. తాజాగా అక్టోబర్‌ 22న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,33,890 వద్ద ట్రేడవుతోంది. అదే వెండి ధర కిలోకు రూ.2,29,900 వద్ద కొనసాగుతోంది.

బుధవారం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 509 మేర తగ్గి రూ. 1,46,010కి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, డిసెంబర్ డెలివరీ బంగారం ధర 10 గ్రాములకు రూ. 509 (అంటే 0.35 శాతం) తగ్గి రూ. 1,46,010 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు, ఫ్యూచర్స్ ట్రేడ్‌లో కిలో వెండి ధరలు రూ. 2,124 మేర తగ్గి రూ. 2,09,361కి చేరాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,890 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,890 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,220 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,040 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,890 ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,890 ఉంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,890 ఉంది.

అమెరికన్ డాలర్ బలపడటం కూడా బంగారానికి ఒక సవాలుగా నిలుస్తుంది. డాలర్ బలపడటం వల్ల, ఇతర కరెన్సీలలో బంగారం కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు అది మరింత ఖరీదైనదిగా మారవచ్చు. ఇది అంతర్జాతీయ డిమాండ్‌పై ప్రభావం చూపవచ్చు. అయితే, బంగారం ధరలు కేవలం వడ్డీ రేట్లపై మాత్రమే ఆధారపడి ఉండవు. ప్రపంచ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడిదారుల డిమాండ్, ద్రవ్యోల్బణం గురించిన ఆందోళనలు కూడా దాని ధరను ప్రభావితం చేస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us