Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

|

Dec 25, 2024 | 7:23 AM

తగ్గుతూ.. పెరుగుతూ.. తగ్గుతూ.. ఇలా గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గడిచిన రెండు రోజుల నుంచి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తూ పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరి హైదరాబాద్ లో తులం ఎంతుందంటే

Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold
Follow us on

అక్కో.! అదిరిపోయే వార్త తీసుకొచ్చేశాం. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గుతూ.. పెరుగుతూ.. తగ్గుతూ.. ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. గడిచిన రెండు రోజుల్లో సుమారు రూ. 110 మేరకు తగ్గింది. బుధవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 70,890 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,340గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. వాటి ధరలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. నేడు.. అంటే గురువారం కిలో వెండి ధర రూ. 98,800గా ఉంది.

ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,340 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.70,890గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల పసిడి ధర రూ.77490 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,040గా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 98,800 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 91,300గా నమోదైంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..