Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో మహిళలు బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి బంగారం, వెండి ధరలు తగ్గితే..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price

Updated on: Feb 22, 2024 | 6:29 AM

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో మహిళలు బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం (ఫిబ్రవరి 22 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. దేశీయ మార్కెట్ లో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 గా ఉంది. వెండి కిలో రూ.75,500 లుగా కొనసాగుతోంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,760 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,900 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,110, 24 క్యారెట్ల ధర రూ.63,390, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,800 గా ఉంది. ముంబైలో రూ.75,800, చెన్నైలో రూ.77,300, బెంగళూరులో రూ.72,400, కేరళలో రూ.77,300, కోల్‌కతాలో రూ.75,800 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,300, విజయవాడలో రూ.77,300, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,300 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us