Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

Gold and Silver Rate Today: బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?
Gold Price

Updated on: Jul 21, 2026 | 6:40 AM

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,43,470 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,31,510 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర పెరిగి.. రూ.2,35,100 గా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,620, 22 క్యారెట్ల ధర రూ.1,31,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల ధర రూ.1,31,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,470, 22 క్యారెట్ల ధర రూ.1,31,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల ధర రూ.1,31,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us