Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు తులం బంగారం ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగురాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,390కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,360వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 95,500కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 95,600కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జూలై మొదటి వారంలోనే పరిస్థితి హెచ్చుతగ్గులమధ్య కొనసాగుతోంది.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు తులం బంగారం ఎంతంటే..
Gold Price
Follow us

|

Updated on: Jul 03, 2024 | 6:19 AM

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగురాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,390కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,360వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 95,500కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 95,600కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జూలై మొదటి వారంలోనే పరిస్థితి హెచ్చుతగ్గులమధ్య కొనసాగుతోంది. నిన్నటి వరకూ బంగారం కొంత తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోలు ప్రియులకు కాస్త ఆశలు చిగురించేలా చేసింది. అయితే అది ఎంతో కాలం నిలవలేక పోయింది. ఈరోజు పెరిగిన బంగారం ధరలతో పెట్టుబడిదారుల్లో కాస్త ఆందోళన కలుగుతోంది. రానున్న రోజుల్లో తగ్గుతుందా, పెరుగుతుందా అన్న సందేహంలో ఉన్నారు పెట్టుబడిదారులు.

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 72,390
  • విజయవాడ – రూ. 72,390
  • బెంగళూరు – రూ. 72,390
  • ముంబై – రూ. 72,390
  • కోల్‎కత్తా – రూ.72,390
  • ఢిల్లీ – రూ.72,410
  • చెన్నై – రూ.72,990

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 66,360
  • విజయవాడ – రూ. 66,360
  • బెంగళూరు – రూ. 66,360
  • ముంబై – రూ. 66,360
  • కోల్‎కత్తా – రూ. 66,360
  • ఢిల్లీ – రూ. 66,390
  • చెన్నై – రూ. 66,910

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 95,600
  • విజయవాడ – రూ. 95,600
  • ముంబై – రూ. 95,600
  • చెన్నై – రూ. 95,600
  • బెంగళూరు – రూ. 89,950
  • కోల్‎కత్తా – రూ. 91,100
  • ఢిల్లీ – రూ. 91,100

గమనిక: ఇవి ఉదయం 7 గంటల వరకు కొనసాగుతున్న ధరలు మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..