04 July 2024
TV9 Telugu
మారుతి సుజుకి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే ఎస్-ప్రెస్సో (S-Presso) కారు. సామాన్యులకు అందుబాటులో ఉండే కార్లు మారుతి సుజుకి.
దీని ధర రూ.4.26 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఆల్టో కే10 కారులో వాడే ఇంజిన్ నే ఇందులోనూ వాడుతున్నారు.
బేస్ వేరియంట్ విత్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కారు మాత్రమే రూ.5 లక్షల (ఎక్స్) కంటే తక్కువ ధరకు లభిస్తుంది.
ఇక ఇండియాలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో మారుతి సుజుకి ఆల్టో ఒకటి. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే.
మొదట్లో అందుబాటులో ఉన్న ఆల్టో800 కారును మారుతి డిస్ కంటిన్యూ చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో కే10 మాత్రమే లభిస్తోంది.
మారుతి సుజుకి ఆల్టో కే10 కారు రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మీరు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ (5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) కారు మాత్రమే రూ.5 లక్షల్లోపు తీసుకోవచ్చు.
ఇక మరో మోడల్ కారు రెనాల్ట్ క్విడ్. ఒకప్పుడు 0.8 లీటర్లు, 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన రెనాల్ట్ క్విడ్.. ఇప్పుడు పెద్ద ఇంజిన్ మాత్రమే కొనసాగిస్తుంది.
ఇక ధర విషయానికొస్తే రూ.4.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కారు మాత్రమే రూ.5 లక్షల్లోపు ధరకు లభిస్తుంది ఈ కారు.