Stock market: స్టాక్ మార్కెట్ నుంచి రాబడి వరద.. పదేళ్లల్లో భారతీయుల సంపాదన ఎంతంటే..?

|

Nov 12, 2024 | 2:12 PM

స్టాక్ మార్కెట్ పై దేశంలోని ప్రజలందరికీ ఆసక్తి పెరిగింది. గతంలో పట్టణ ప్రజలకు మాత్రమే పరిమితిమైన స్టాక్ లు ఇప్పడు గ్రామీణులకు అందుబాటులోకి వచ్చాయి. కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో రాబడి వచ్చే అవకాశం ఉండడంతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతంలో బ్యాంకులు, ఫోస్టాఫీసుల్లోని ఫిక్సడ్ డిపాజిట్ పథకాలలో ఎక్కువగా డబ్బులు పెట్టుబడి పెట్టేవారు.

Stock market: స్టాక్ మార్కెట్ నుంచి రాబడి వరద.. పదేళ్లల్లో భారతీయుల సంపాదన ఎంతంటే..?
Follow us on

ప్రస్తుతం వాటితో పాటు స్టాక్ మార్కెట్ పైనా శ్రద్ద చూపుతున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాలు గత పదేళ్లలో స్టాక్ మార్కెట్ ద్వారా ఒక ట్రిలియన్ డాలర్లు సంపాదించాయి. ఒక ట్రిలియన్ అంటే మన డబ్బులో లక్ష కోట్ల రూపాయలకు సమానం. దేశంలో స్టాక్ మార్కెట్ కు పెరుగుతున్న ఆదరణకు ఈ లెక్కలు ప్రమాణికంగా నిలుస్తున్నాయి. గతంలో పోల్చితే
ఇప్పుడు స్టాక్ మార్కెట్ కు ఆదరణ పెరిగినందున పెట్టుబడులు, రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన మోర్గాన్ స్టాన్లీ ఈ నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం.. భారతీయులు స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే ఈక్విటీలలో మాత్రం ఇప్పటికీ తక్కువగానే పెట్టుబడి పెడుతున్నారు. ఇది వారి ఆదాయంలో మూడు శాతం మాత్రమే ఉంది. రాబోయే ఏడాదిలో ఈ సంఖ్య రెండింతలకు చేరుకుంటుంది.

దేశంలో గత పదేళ్లలో జాబితా చేయబడిన అన్ని కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ మార్చి 2014 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ప్రపంచంలో ఐదో అతి పెద్ద మార్కెట్ గా మారింది. గ్లోబల్ కాపిటలైజేషన్ లో దేశం వాటా 2013లో కేవలం 1.6 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు 2024 నాటికి 4.3 శాతానికి చేరుకుంది. గత దశాబ్దంగా బంగారం 22 శాతం పెరిగిన ఎక్కువ సంపదను తీసుకువచ్చింది. బంగారం, ఈక్విటీలలో పెట్టుబడులు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. పెట్టుబడి దారులకు రాబడిని అందిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపదను పోగుచేసే ముఖ్య సాధనాలుగా మారాయి. అయితే ఈ పెట్టుబడులు ప్రజల ఆదాయంలో మూడు శాతంగా మాత్రమే నమోదవుతున్నాయి. కాలక్రమీణా ఇవి బాగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మోర్గాన్ స్టాన్లీ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ఈ నివేదకను వెల్లడించింది. ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకుల మాదిరిగా ఖాతాదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించవు. కేవలం ఆర్థిక సలహాలను అందిస్తూ ఆదాయం సంపాాదిస్తాయి. ఫ్రైవేటు కంపెనీలు పబ్లిక్ ఆఫర్ల ద్వారా తమ వాటాలను విక్రయించి నిధులను సమకూర్చుకునేందుకు దోహదపడతాయి. మోర్గాన్ స్టాన్లీతో పాటు గోల్డ్మన్ సాచ్స్, జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్, డాయిష్ బ్యాంకు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి