దీపావళి లేదా పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో బంగారం, వెండి వినియోగం పెరుగుతుంది. పండుగల సీజన్‌లో బంగారం, వెండి దుకాణాలను ఎంతో ఆకర్షణీయంగా అలంకరించగా, కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్లను కూడా అందజేస్తున్నారు. హిందూ మతంలో దీపావళి లక్ష్మీ దేవి పండుగగా భావిస్తుంటారు. ఈ పండగకు చాలా మంది ఎంతో కొంద బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే దీపావళి, ధంతెరస్‌కు బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో లక్షిదేవి వచ్చి సిరులు కురిపిస్తుందని నమ్ముతుంటారు. అదే సమయంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారం, భారతదేశంలోని ప్రజలు వివాహాలలో బంగారం ఇస్తారు.
ఇది కూడా చదవండి: Smartphones Heating: బ్లాక్ ప్యానెల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు వేడెక్కుతాయి? అసలు కారణాలు ఏంటి?
అయితే, బంగారం, వెండి కొనుగోలుకు పరిమితి ఉంది. ఆ పరిమితిని మించిన కొనుగోళ్లకు ప్రభుత్వం కొన్ని వివరాలను అందించాలి. నల్లధనాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. అటువంటి పరిస్థితిలో మీరు బంగారం, మరియు వెండి లావాదేవీలకు సంబంధించిన నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నగదును ఉపయోగిస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి.
పరిమితికి మించిన కొనుగోళ్లపై ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది:
రత్నాలు, ఆభరణాల రంగాన్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 కిందకు తీసుకురావడం ద్వారా బంగారం నగదు రూపంలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఆభరణాల వ్యాపారులందరూ కేవైసీ (KYC) నిబంధనలను పాటించాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అటువంటి పరిస్థితిలో మీరు నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ నగదులో బంగారం కొనుగోలు చేయడానికి లావాదేవీ చేస్తే, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ గురించి సమాచారాన్ని అందించాలి. ఇది కాకుండా రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Post Office: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.12 లక్షల వడ్డీ..!
నగదుతో బంగారం కొనడానికి పరిమితి ఉందా?
ఇది కాకుండా, ఆదాయపు పన్ను శాఖ నిర్దిష్ట పరిమితులకు మించి నగదు ఉపసంహరణలపై TDS, ఒక రోజులో వ్యక్తుల మధ్య గరిష్ట మొత్తంలో నగదు లావాదేవీలపై పరిమితులతో సహా నగదుపై బంగారం కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం, మీరు ఒక రోజులో కేవలం రూ. 2 లక్షల వరకు మాత్రమే బంగారంపై నగదు రూపంలో లావాదేవీలు చేయవచ్చు. ఇది దాటితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271డి కింద నగదు రూపంలో లావాదేవీ జరిపిన మొత్తానికి సమానమైన పెనాల్టీని గ్రహీతపై విధించవచ్చు.
ఇది కూడా చదవండి: TV Tariff Plan: టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్.. పెరగనున్న ధరలు.. ప్రభుత్వం కొత్త నిబంధనలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి