బంగారం, వెండే కాదు.. దీన్ని ధరలు కూడా ఢమాల్.. ఇన్వెస్టర్లకు బిగ్ షాక్..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో కేబుల్, వైర్ తయారీ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం ప్రముఖ కంపెనీల షేర్లను భారీగా కుదిపేస్తోంది. ప్రముఖ దిగ్గజ కంపెనీలైన పాలిక్యాబ్, ఆర్‌ఆర్‌ కేబుల్, ఫినోలెక్స్ కేబుల్స్ షేర్లు కేవలం ఒక్క వారంలోనే 6 నుంచి 10శాతం వరకు నష్టపోవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బంగారం, వెండే కాదు.. దీన్ని ధరలు కూడా ఢమాల్.. ఇన్వెస్టర్లకు బిగ్ షాక్..
Copper Prices Hit 5 Month Low

Updated on: Nov 18, 2026 | 6:46 PM

దేశీయ స్టాక్ మార్కెట్‌లో కేబుల్, వైర్ తయారీ రంగ షేర్లు గత వారం రోజులుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ కంపెనీలైన పాలిక్యాబ్, ఆర్‌ఆర్‌ కేబుల్, ఫినోలెక్స్ కేబుల్స్ షేర్లు వరుసగా 6 నుంచి 10శాతం వరకు పడిపోయాయి. ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడమే ఈ నష్టాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో రాగి ధరలు గరిష్ట స్థాయి 14,870 డాలర్ల నుంచి ఏకంగా 11శాతం వరకు కరెక్షన్‌కు గురయ్యాయి. ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో రాగి ధరలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక సగటు కంటే 4శాతం తక్కువగా ట్రేడవుతున్నాయి. రాగి ధరలు పడిపోవడంతో డీలర్లు, కొనుగోలుదారులు మరింత ధరలు తగ్గుతాయనే అంచనాతో కొనుగోళ్లను వాయిదా వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వాల్యూమ్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం

గత ఏడాది మూడో త్రైమాసికంలో రాగి ధరలు భారీగా పెరగడంతో, డీలర్లు ముందుగానే భారీగా ఇన్వెంటరీని నిల్వ చేసుకున్నారు. దీనివల్ల గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీలు అద్భుతమైన వాల్యూమ్ వృద్ధిని నమోదు చేశాయి. ఆ సమయంలో పాలిక్యాబ్ వాల్యూమ్స్ 40శాతం, ఆర్‌ఆర్‌ కేబుల్ దేశీయ వాల్యూమ్ వృద్ధి 30శాతం, ఫినోలెక్స్ వైర్ల వ్యాపారం 28శాతం వృద్ధిని సాధించాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆ ప్రభావం కారణంగా వాల్యూమ్ వృద్ధి మందగించే అవకాశం ఉందని ఈక్విరస్ సంస్థ అంచనా వేసింది.

మార్జిన్లు – స్టేటస్

ధరల్లో మార్పులను ఎప్పటికప్పుడు పాస్-త్రూ చేయడం వల్ల కంపెనీల మార్జిన్లు చాలా వరకు నిలకడగా ఉండే అవకాశం ఉందని ఈక్విరస్ తెలిపింది. అయితే యూనిట్‌ వారీగా వచ్చే సంపూర్ణ లాభాలపై కొంత ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

వివిధ కంపెనీల షేర్ల వివరాలు.

పాలిక్యాబ్ ఇండియా: షేరు ధర సుమారు 5శాతం నష్టంతో రూ.7,314.5 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో ఈ షేరు 8.9శాతం, గత ఆరు నెలల్లో 19.7శాతం పడిపోవడంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రతికూల రాబడులను నమోదు చేసింది.

ఆర్‌ఆర్‌ కేబుల్: షేరు ధర 1.9శాతం క్షీణించి రూ.1,823 వద్ద ఉంది. గత నెలలో 23.6శాతం, గత ఆరు నెలల్లో 6.3శాతం పడిపోగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24.2శాతం నష్టపోయింది.

ఫినోలెక్స్ కేబుల్స్ : షేరు ధర 3.3శాతం తగ్గి రూ.1,189.7 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో 7.3శాతం పడినప్పటికీ, గత ఆరు నెలల్లో 16.2శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 51.2శాతం లాభపడి సానుకూలంగా కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us