AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: మీకు తెలియకుండా మీ ఆధార్‌ను ఎవరైనా ఉపయోగించారా..? చిటికెలో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..

ఆధార్ వినియోగదారుల కోసం యూఐడీఏఐ అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఆధార్ భద్రత కోసం కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అందులో భాగంగా మీ ఆధార్ ఎవరైనా మీకు తెలియకుండా వాడితే తెలుసుకునేందుకు హిస్టరీ చెక్ చేసుకునే ఆప్షన్ గతంలో వచ్చింది. ఇది ఎలానో చూద్దాం.

Aadhaar Card: మీకు తెలియకుండా మీ ఆధార్‌ను ఎవరైనా ఉపయోగించారా..? చిటికెలో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 1:59 PM

Share

ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఇక బ్యాంకింగ్ సేవలు పొందటంతో పాటు అనేక పనులకు ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంతో దేశంలోని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరూ ఆధార్ కలిగి ఉండటమే కాకుండా నిరంతరం దానితో అవసరం పడుతుంది. దీంతో ఆధార్ కార్డుల దుర్వినియోగం కూడా పెరిగిపోతుంది. ఇతరుల ఆధార్ కార్డులను కొంతమంది సంపాదించి తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు యూఐడీఏఐ అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకునే ఆప్షన్‌తో పాటు మీరు ఆధార్ ఎవరైనా వాడితే తెలుసుకునేందుకు అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు ఎవరు వాడారు.. ఎంతుకోసం వాడారు అనే వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు.

మీరు ఆధార్‌ను ఉపయోగిస్తే..?

బ్యాంకింగ్, ప్రభుత్వ లేదా ఇతర సర్వీసుల కూడా ఆధార్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఓటీపీ ద్వారా ఈకేవైసీ లేదా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించినప్పుడు ఆ వివరాలు యూఐడీఏఐ సిస్టమ్‌లో నమోదవుతాయి. దీనినే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అంటారు. మీరు ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనేది దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్‌ను మీకు తెలియకుండా ఎవరైనా ఉపయోగించినా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

Aadhaar

Aadhaar

ఎలా చెక్ చేసుకోవాలి..?

-యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి -మై ఆధార్ సెక్షన్‌లోకి వెళ్లండి -ఆధార్ అథెటికేషన్ హిస్టరీ ఆప్షన్‌ను ఎంచుకోండి -మీ ఆధార్ నెంబర్‌తో పాటు అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి -మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి -ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయండి -అక్కడ మీ ఆధార్ ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించారు.. ఏ తేదీన ఉపయోగించారు అనే వివరాలు కనిపిస్తాయి.

తప్పుగా ఎవరైనా వాడితే..?

ఒకవేళ మీ వివరాలను ఎవరైనా తప్పుగా వాడితే యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీంతో సిబ్బంది చర్యలు తీసుకుంటారు. ఇక వేరేవాళ్లు వాడకుండా మీరు బయోమెట్రిక్ లాన్ చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల మీ బయోమెట్రిక్స్ ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేదు. ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ ఆధార్ ఇతరులు వాడుకోవడానికి కుదరదు. యూఐడీఏఐ వెబ్‌సైట్లో బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ అనే ఆప్షన్ ఉంటుంది.

Follow Us
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ
భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ