PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. ఆ రోజే అకౌంట్లోకి రూ.2 వేలు..? డేట్ ఫిక్స్..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం(పీఎం కిసాన్) నిధుల విడుదలపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ తర్వాత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ కానున్నాయి.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. ఆ రోజే అకౌంట్లోకి రూ.2 వేలు..? డేట్ ఫిక్స్..
Pm Kisan

Updated on: Jan 28, 2026 | 3:57 PM

పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశంలోని రైతులందరూ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పంట సాగు మొదలైంది. దీంతో పెట్టుబడి కోసం రైతుల దగ్గర డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది బ్యాంకు రుణాలు తెచ్చుకుంటుండగా.. మరికొంతమంది వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో పీఎం కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ తమిళనాడు వేదికగా విడుదల చేయగా.. 22వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. జనవరిలో ఈ డబ్బులు జమ అవుతాయని రైతులు ఆశించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది.

ఫిబ్రవరి తొలివారంలో జమ..!

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో పీఎం కిసాన్ పథకానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ సారి దీనికి ఎన్ని నిధులు కేటాయిస్తారనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీంతో బడ్జెట్ ప్రకటన తర్వాత ఫిబ్రవరి తొలివారంలో పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ బటన్ నొక్కి నేరుగా నిధులు జమ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈకేవైసీ ఇనాక్టివ్ అయి ఉంటే వెంటనే యాక్టివ్ చేయించుకోవాలి. ఆధార్ ఉపయోగించి ఆన్ లైన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశముంది.

ఏపీ రైతులకు రూ.6 వేలు

పీఎం కిసాన్ పథకంతో కలిసి అన్నదాత సుఖీభవ స్కీమ్‌ను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఏపీలోని రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేలతో పాటు అన్నదాత సుఖీభవ ద్వారా రూ.4 వేలు అందనున్నాయి. దీంతో ఏపీలోని రైతుల బ్యాంకు అకౌంట్లలో ఫిబ్రవరి తొలివారంలో రూ.6 వేలు జమ కానున్నాయి. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఏడాదికి రూ.20 వేలు అందిస్తోంది. పీఎం కిసాన్ రూ.6 వేలు అందుతుండగా..  ఏపీ ప్రభుత్వం రూ.14 వేలు అందిస్తోంది. కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తోంది. ఇద్దరు రైతులు ఉంటే అన్నదాత సుఖీభవ అందదు.