Ather Rizta: అదరగొడుతున్న ఏథర్‌ రిజ్టా ఫీచర్లు.. కుటుంబ ప్రయాణికులకు ది బెస్ట్‌ ఎంపిక

ఇటీవల ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్‌ రిలీజ్‌ చేసిన రిజ్టా ఈవీ స్క​ఊటర్‌ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ను రివ్యూ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇటీవల ఏథర్‌ స్కూటర్‌ నంది హిల్స్‌లో ఓ ఔత్సాహికుడు రైడ్‌ చేసి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏథర్‌ రిజ్టా రైడింగ్‌ అనుభవం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Ather Rizta: అదరగొడుతున్న ఏథర్‌ రిజ్టా ఫీచర్లు.. కుటుంబ ప్రయాణికులకు ది బెస్ట్‌ ఎంపిక
Ather Rizta Family Scooter
Follow us

|

Updated on: May 26, 2024 | 6:35 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వినియోగం బాగా పెరిగింది. మొదట్లో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈవీ స్కూటర్లు క్రమేపి మారిన టెక్నాలజీ కారణంగా గ్రామీణులు కూడా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు నూతన మోడల్స్‌తో ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్‌ రిలీజ్‌ చేసిన రిజ్టా ఈవీ స్క​ఊటర్‌ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ను రివ్యూ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇటీవల ఏథర్‌ స్కూటర్‌ నంది హిల్స్‌లో ఓ ఔత్సాహికుడు రైడ్‌ చేసి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏథర్‌ రిజ్టా రైడింగ్‌ అనుభవం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఏథర్ ఎనర్జీ కంపెనీ ప్రాక్టికాలిటీతో పాటు కుటుంబ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని రిజ్టాను రూపొందించింది. ఈ స్కూటర్‌ ఏథర్‌ 450 ఎక్స్‌లా స్పోర్టీగా ఉండకపోయినా సవాలుతో కూడిన ప్రయాణంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని రైడర్‌ పంచుకున్నారు. ముఖ్యంగా రిజ్టా సౌకర్యవంతమైన సీటు, కుటుంబ స్నేహపూర్వక డిజైన్ పిల్లలకు పెద్దలకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. హై స్పేస్‌ లెగ్‌ రెస్ట్‌తో పాటు ఖరీదైన ప్యాడెడ్ సీటు ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్నారు. రిజ్టా 5.8 బీహెచ్‌పీ మోటార్, 22 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రిజ్టా స్పీడ్‌ తననకు చాలా ఆకట్టుకుందని వివరించారు. 

ముఖ్యంగా రిజ్టా ఈవీ స్కూటర్‌ ట్రాఫిక్‌ సమయంలో నావిగేట్ చేయడంతో పాటు వేగంగా రియాక్ట్‌ అవ్వడానికి అనువుగా ఉందని వివరించారు. రిజ్టా జెడ్‌ వేరియంట్‌ను క్లెయిమ్ చేసిన 123 కిమీ పరిధిని కలిగి ఉంది. అలాగే నంది హిల్స్‌పైకి ఎక్కి, ఆ తర్వాత రైడ్‌లో కొన్ని ఉత్సాహభరితమైన స్ట్రెచ్‌లతో సహా సుదీర్ఘ రైడ్‌ను అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇంక రిజ్టాకు సంబంధించిన డిజైన్, సంప్రదాయంగా ఉన్నప్పటికీ,  దాని లైటింగ్, సరళమైన లైన్‌లతో ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది. చక్కగా గుండ్రంగా ఉన్న బాడీ ప్యానెల్‌లు భద్రతా భావాన్ని పెంచుతున్నాయని తెలిపారు. 

ఇవి కూడా చదవండి

ఏథర్‌ స్టాక్‌ 6 (ఆండ్రాయిడ్‌ ఓపెన్ సోర్స్ ఓఎస్‌ ఆధారంగా)తో కూడిన 7 అంగుళాల టీఎఫ్‌టీ కన్సోల్, స్పష్టమైన సమాచారం, సహజమైన నావిగేషన్‌ను అందిస్తుంద. ఏథర్‌కు సంబంధించిన స్కిడ్‌కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ట్రాక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. రీజెన్ బ్రేకింగ్, ఆటోహోల్డ్, రివర్స్ మోడ్ కలయిక రిజ్టా రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కొన్ని చోట్ల అసమానమైన రోడ్లు ఉన్నప్పటికీ, సస్పెన్షన్ వల్ల సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆశ్వాదించవచ్చని వివరించారు. అలాగే పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, ఐచ్ఛిక ఫ్రంక్ దాని ప్రాక్టికాలిటీని జోడిస్తుంది. అందువల్ల ఈ స్కూటర్‌ రోజువారీ ప్రయాణాలకు అనువైనదని ఆ రైడ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే
అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే
నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు.. బీకేర్‌ఫుల్..!
నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు.. బీకేర్‌ఫుల్..!
తప్పతాగి కూతురిని వేధిస్తున్నాడనీ.. అల్లుడిని హత్య చేసిన మామ!
తప్పతాగి కూతురిని వేధిస్తున్నాడనీ.. అల్లుడిని హత్య చేసిన మామ!
హే వయ్యారి.! ఇది నువ్వేనా.. అర్జీవీ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి
హే వయ్యారి.! ఇది నువ్వేనా.. అర్జీవీ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి
రూ. 7వేలలో 50 ఎంపీ కెమెరా.. సూపర్ స్మార్ట్‌ ఫోన్‌..
రూ. 7వేలలో 50 ఎంపీ కెమెరా.. సూపర్ స్మార్ట్‌ ఫోన్‌..
విచిత్రం.. ఒకే నెంబర్‌పై రెండు నెట్‌వర్క్‌లు..
విచిత్రం.. ఒకే నెంబర్‌పై రెండు నెట్‌వర్క్‌లు..
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!