Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ మిస్ చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బందులే..

|

Jun 23, 2022 | 9:19 PM

లోన్ ఈఎంఐల చెల్లింపులో ఆలస్యం డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. మీ రుణాన్ని బ్యాడ్ డెట్‌లో చేర్చే ముందు, అంటే నాన్-పెర్ఫార్మింగ్ అసెట్, బ్యాంక్ మీకు హెచ్చరికతో చెల్లింపు కోసం సమయం ఇస్తుంది.

Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ మిస్ చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బందులే..
Home Loan
Follow us on

ఏప్రిల్ 2022లో RBI విడుదల చేసిన గ్రాస్ బ్యాంక్ క్రెడిట్ రిపోర్ట్ ఏ రంగంలో బ్యాంకులు ఎంతెంత లోన్స్ ఇచ్చాయో స్పష్టం చేస్తోంది. ఈ రిపోర్ట్స్ ప్రకారం మొత్తం రూ.34 లక్షల కోట్ల పర్సనల్ లోన్స్‌లో సగం హోమ్ లోన్స్ కావడం గమనించదగ్గ అంశం. దాదాపు రూ.17 లక్షల కోట్ల హోమ్ లోన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 2021తో పోలిస్తే ఇది 13.7 శాతం పెరిగింది. లోన్ తీసుకోవడం వల్ల సొంతింటి కల నెరవేరుతుంది. అందుకే హోమ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు హోమ్ లోన్స్‌పై క్రమేపీ పెరుగుతున్న వడ్డీ భారంగా మారుతోంది.

రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లలో ప్రతి 50 బేసిస్ పాయింట్ల పెరుగుదల హోమ్ లోన్‌కి సమబంధించిన EMIని 4 శాతం వరకు పెంచుతుంది. వరుసగా మే-జూన్‌ నెలల్లో ఆర్‌బీఐ వడ్డీని 90 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇటువంటి పరిస్థితిలో, EMI పెరగడానికి కూడా అవకాశం ఏర్పడింది. 10 సంవత్సరాల కాల వ్యవధితో 7.1% వడ్డీకి తీసుకున్న రూ. 35 లక్షల హోమ్ లోన్ ఇప్పుడు 8%కి పెరిగింది. ఇప్పుడు ఈ మొత్తంపై రూ.40818 గా ఉన్న ఈఎంఐ రూ.42,465కి పెరుగుతుంది. మొత్తం రుణంపై వడ్డీ చెల్లింపు కూడా 13.98 లక్షల నుంచి 15.96 లక్షలకు పెరిగిపోతుంది. లోన్ పై పెరిగిన వ్యయం మీ బడ్జెట్‌ను పాడుచేస్తే, డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ డిఫాల్ట్‌ను నివారించడానికి ఈ నాలుగు టిప్స్ పాటించవచ్చు.

  1. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి మీ పెట్టుబడుల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ద్వారా అదనపు నిధులను సేకరించవచ్చు.
  2. మీరు చేయగలిగిన చోట నుంచి మీ ఖర్చులను తగ్గించడం ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించేలా మీ డబ్బును నిర్వహించాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుని ఉంటే, దాన్ని ఉపయోగించండి.
  5. పర్సనల్ లోన్ తీసుకోవడం ద్వారా డబ్బును ఏర్పాటు చేసుకునే విషయానికి వస్తే, దానిని చివరి ఎంపికగా ఉపయోగించండి. చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. కాబట్టి మీ కార్యాలయంలో అలాంటి పథకం ఏదైనా ఉంటే, దాని గురించి తెలుసుకోండి.

లోన్ ఈఎంఐల చెల్లింపులో ఆలస్యం డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. మీ రుణాన్ని బ్యాడ్ డెట్‌లో చేర్చే ముందు, అంటే నాన్-పెర్ఫార్మింగ్ అసెట్, బ్యాంక్ మీకు హెచ్చరికతో చెల్లింపు కోసం సమయం ఇస్తుంది.

ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. మీరు రెండు వారాల ఆలస్యంతో పేమెంట్ చేస్తే.. బ్యాంకు చెల్లించాల్సిన వాయిదాపై 1-2% పెనాల్టీని విధిస్తుంది. కానీ, ఈ ఆలస్యం 30 రోజుల కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు విషయం మరింత దిగజారవచ్చు. 90 రోజుల ఈఎంఐ పేమెంట్ ఆలస్యంతో మీ ఆస్తిని జప్తు చేసే పరిస్థితి కూడా ఉండవచ్చు. EMI చెల్లించడంలో 90 రోజులు ఆలస్యం అయినప్పుడు, అది ప్రధాన డిఫాల్ట్ అవుతుంది. ఈ పరిస్థితిలో రుణం బ్యాడ్ క్రెడిట్‌గా పరిగణిస్తారు. బ్యాంకు రుణ రికవరీ ప్రక్రియను ప్రారంభించవచ్చు. 2002లో చేసిన SARFAESI చట్టం (సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్) రుణగ్రహీత తనఖా పెట్టిన ఆస్తిని జప్తు చేయడానికి, విక్రయించడానికి బ్యాంక్‌కు అధికారం ఇస్తుంది. తద్వారా బాకీ ఉన్న లోన్ తిరిగి పొందవచ్చు. సంబంధిత లోన్‌ను ఎక్కడి నుంచైనా తిరిగి రాబట్టుకునే అవకాశం బ్యాంకులకు లేనప్పుడు బ్యాంకులు ఈ చర్యలు తీసుకోవచ్చు.

మీరు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా చెల్లించలేకపోతే, ఈఎంఐ నుంచి పారిపోకుండా, పరిస్థితిని బ్యాంకుకు చెప్పడం మంచిదని రుణ సలహాదారు మందార్ జల్కికర్ చెబుతున్నారు. మీ పెట్టుబడులు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకోవడం ద్వారా EMI వీలైనంత వరకు బౌన్స్ కాకుండా చెల్లించమని ఆయన సూచిస్తున్నారు.

రుణగ్రహీత బ్యాంకుతో మాట్లాడవచ్చు. మధ్యస్థ అనుమతి కోసం అడగవచ్చు. దీని కింద, మీరు మొత్తం EMI చెల్లించలేకపోతే, వడ్డీని చెల్లించడానికి మాత్రమే అనుమతి తీసుకోండి. లేదా పునర్నిర్మాణం ద్వారా లోన్ వ్యవధిని పొడిగించడానికి లేదా కొన్ని రోజుల పాటు లోన్ ఇవ్వకుండా ఉండటానికి మీరు మారటోరియం కోసం కూడా బ్యాంకును రిక్వెస్ట్ చేయవచ్చు.

ఒక నెల హోమ్ లోన్ కోసం EMI చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్‌లో 50 పాయింట్లు తగ్గిపోతాయని గుర్తుంచుకోండి. ఒకసారి క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే.. దాన్ని మెరుగుపరచడానికి సంవత్సరాలు పడుతుందనే సంగతి కూడా గుర్తుంచుకోవడం అవసరం.