Auto News: మే నెలలో కార్ల పండగ.. భారత మార్కెట్లోకి వస్తున్న టాప్‌ 5 కొత్త కార్లు ఇవే..!

Auto News: భారత మార్కెట్లో టోయోటా నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందిన ఈ కారులో 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా ఇది 541 కిలోమీటర్ల రేంజ్..

Auto News: మే నెలలో కార్ల పండగ.. భారత మార్కెట్లోకి వస్తున్న టాప్‌ 5 కొత్త కార్లు ఇవే..!
New Cars

Updated on: May 01, 2026 | 10:17 AM

May Monthy New Cars: భారత ఆటోమొబైల్ రంగానికి మే నెల అత్యంత కీలకంగా మారబోతోంది. ఈ నెలలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), హైబ్రిడ్ మోడల్స్, పవర్‌ఫుల్‌ ఎస్‌యూవీలు (SUVs) మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మే నెలలో విడుదల కానున్న ఆ 5 అద్భుతమైన కార్ల వివరాలు మీకోసం.

ఇది కూడా చదవండి: Wonderla: వండర్‌లా అదిరిపోయే ఆఫర్స్.. విద్యార్థులకు భారీ డిస్కౌంట్.. బై 2 గెట్ 1 ఫ్రీ..!

1. టాటా సియెర్రా EV (Tata Sierra EV):

టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ ‘సియెర్రా’ను ఎలక్ట్రిక్ రూపంలో మే చివరి నాటికి తీసుకురానుంది. ఇందులో 75 kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్స్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, అడ్వాన్స్‌డ్ ADAS ఫీచర్లతో ఇది రానుంది.

2. హోండా ZR-V (Honda ZR-V):

హోండా నుంచి వస్తున్న సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇది. మే 22న లాంచ్ కానున్న ఈ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది 181 bhp పవర్, 315 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వైర్లెస్ ఛార్జర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

3. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (Honda City Facelift):

హోండా తన పాపులర్ సెడాన్ ‘సిటీ’లో మరిన్ని అప్‌డేట్స్ తీసుకువస్తోంది. మే 22న విడుదల కానున్న ఈ కొత్త వెర్షన్‌లో 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అదనంగా చేరనున్నాయి. ఇది హైబ్రిడ్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

4. ఎంజీ మెజెస్టర్ (MG Majestor):

టోయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఎంజీ మోటార్స్ ‘మెజెస్టర్’ను లాంచ్ చేస్తోంది. 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్ సీట్లు, అద్భుతమైన ఆఫ్‌రోడ్ సామర్థ్యాలతో ఇది వస్తోంది. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

5. టోయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella):

భారత మార్కెట్లో టోయోటా నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందిన ఈ కారులో 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా ఇది 541 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, JBL సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ మే నెలలో రాబోయే మోడల్స్ కోసం వేచి చూడటం మంచిదంటున్నారు టెక్‌ నిపుణులు.

టూ వీలర్స్

మే 2026లో పెర్ఫార్మెన్స్, క్రూయిజర్, ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు అనేక మోటార్‌సైకిళ్లు విడుదల కానున్నాయి. ఇందులో హీరో కరిజ్మా XMR 250 , రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 , ట్రయంఫ్ ట్రైడెంట్ 800 , నార్టన్ మ్యాంక్స్ R వంటి ప్రీమియం ఎంపికలుఈ సమయంలోనే బజాజ్ కొత్త పల్సర్ మోడళ్లతో తన శ్రేణిని విస్తరించనుంది.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

ఇది కూడా చదవండి: LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

ఇది కూడా చదవండి: Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us