శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను అందించబోతోంది. వైకుంఠ దర్శనం చేసుకుని..ఆ ఏడు కొండలవాడిని తనివితీరా చూడాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కోరుకుంటూ ఉంటారు. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం గుండా వెళ్లి దర్శించుకునే వీలుంది. కానీ రద్దీ వల్ల అది అందరికి సాధ్యం కాదు. కానీ ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే ప్రతిపాదనలు టీటీడీ సిద్దం చేస్తోంది. […]

శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Nov 27, 2019 | 12:45 PM

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను అందించబోతోంది. వైకుంఠ దర్శనం చేసుకుని..ఆ ఏడు కొండలవాడిని తనివితీరా చూడాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కోరుకుంటూ ఉంటారు. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం గుండా వెళ్లి దర్శించుకునే వీలుంది. కానీ రద్దీ వల్ల అది అందరికి సాధ్యం కాదు. కానీ ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే ప్రతిపాదనలు టీటీడీ సిద్దం చేస్తోంది. టీటీడీ ఆగమ సలహామండలి కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పాలకమండలి ఆమోదం తెలుపడమే తరువాయి. ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో 10 రోజులపాటు ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పాలకవర్గ మీటింగ్‌లో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ పద్దతికి శ్రీకారం చుడతారు.