Budget 2021 : మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం శెట్టి బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు.

Budget 2021 :  మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2021 | 11:37 AM

First Indian Budget 1947 : భారత దేశంలో మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్‌ను1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు. ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు అంటే.. ఏడున్నర నెలలకు మాత్రమే అమలయ్యింది.

ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రధానంగా.. ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి, దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని బలోపేతం చేయటం గురించి మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు.

అయితే. తొలి బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఎక్కువ ఆహారం పండించండి’ అన్న ప్రచారం పెద్దగా విజయం సాధించలేదు. దాని ప్రభావం ఆహార పంపిణీ వ్యవస్థపై పడింది. స్వాతంత్ర్యానికి ముందు నాలుగేళ్లు.. అంటే 1944 నుంచి 47 వరకు రూ.127 కోట్ల విలువ చేసే 43.80 లక్షల టన్నుల ఆహార పదార్థాలను భారతదేశం దిగుమతి చేసుకుంది.

స్వాతంత్ర్యం పొందిన సంవత్సరంలో కూడా రూ.42 కోట్ల విలువైన 10.62 లక్షల ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునేందుకు ఒక కమిటీ ఆ దేశంలో పర్యటించింది. ఇలా విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవటం ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై పెను ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు చెప్పారు.

తొలి కేంద్ర బడ్జెట్ ఆదాయ.. వ్యయాలను ఓసారి పరిశీలిస్తే…

ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లు

వ్యయం అంచనా.. రూ.197.39 కోట్లు

లోటు.. రూ.26.24 కోట్లు

అయితే, లోటు ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే శరణార్థుల పునరావాసం కోసం ఖర్చు చేయటంతో పాటు కొత్తగా ఏర్పడ్డ పశ్చిమ బెంగాల్, తూర్పు పంజాబ్‌ ప్రావిన్సులకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలి. అయితే, ఆధారపడదగ్గ సమాచారం లేనందున వాటికి నిర్దుష్టంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షన్ముఖం శెట్టి తెలిపారు.

ప్రతిపాదించిన ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లు

కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు,

ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు

సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లు.

పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖ నుంచి ఆదాయం రూ.15.9 కోట్లు

ఖర్చు, వడ్డీ రూ.13.9 కోట్లు.

నికర మిగులు అంచనా రూ.2 కోట్లు.

ఖర్చు రూ.197.39 కోట్లు

రక్షణ సేవలకు రూ.92.74 కోట్లు

పౌర ఖర్చులకు. విభజన కారణంగా రక్షణ రంగానికి సాధారణం కంటే ఎక్కువ ఖర్చు చేశారు.

Also Read: Budget in Telugu 2021 LIVE: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

Latest Articles
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం