హెల్త్ బులెటిన్ పై తెలంగాణ హైకోర్టు ఆరా

|

Jul 01, 2020 | 4:58 PM

రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిలిపేడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో కొవిడ్ పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడంపై అసహానాన్ని వ్యక్తం చేసింది

హెల్త్ బులెటిన్ పై తెలంగాణ హైకోర్టు ఆరా
Follow us on

రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో కొవిడ్ పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడంపై అసహానాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో అరకొర సమాచారం ఉంటుందన్న హైకోర్టు.. మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారాన్ని కూడా చేర్చాలని సూచించింది.