నిండిన చెరువులు.. దుంకిన మత్తళ్లు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది.

నిండిన చెరువులు.. దుంకిన మత్తళ్లు
Follow us

|

Updated on: Aug 16, 2020 | 11:08 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. అనేక చోట్ల వాగులు, చెరువులు,కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పొలాలు, రోడ్లు, వాగులు, చెరువులు.. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా పట్టిన ముసురు వదలడంలేదు. గంటల తరబడి కురిస్తున్న వర్షానికి వరద పోటెత్తింది.

పొలం పనులకు వెళ్లిన కూలీలు వరద నీటిలో చిక్కుపోయారు. అటు, పశువులు మేపేందుకు పోయిన కాపర్లు, వంతెనలవద్ద వాహనదారులు నడుమ వరకు వచ్చిన నీళ్ల మధ్య చిక్కుకుని అవస్థలు పడ్డారు. వరదనీటితో పంట పొలాలు నీట మునిగాయి. వరినాట్లు మునిగి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు చెరువులను తలపించాయి. చెరువులు పూర్తిగా నిండి అలుగులుపొస్తున్నాయి. కొన్ని చోట్ల గండ్లు పడతాయనే భయంతో చెరువు మత్తళ్లను తవ్వేశారు. పోటెత్తిన వరదలకు పలవురు గల్లంతయ్యారు. పలుచోట్ల మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని జిల్లాల్లోని ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాట్లు చేసి పర్యవేక్షించాలని సూచించింది.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి