ధోనీ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై నో యాడ్స్.. ఓన్లీ వ్య‌వ‌సాయం

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు, చెప్పాల్సింది ఏమీ లేదు. తాజాగా ధోనీ త‌న 39వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై యాడ్స్ చేయ‌బోన‌ని, అలాంటి వాటికి దూరంగా ఉంటాన‌ని వెల్ల‌డించాడు. ఇక నుంచి ఎలాంటి డీల్సూ కుదుర్చుకోన‌ని..

ధోనీ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై నో యాడ్స్.. ఓన్లీ వ్య‌వ‌సాయం
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 9:15 AM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు, చెప్పాల్సింది ఏమీ లేదు. తాజాగా ధోనీ త‌న 39వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై యాడ్స్ చేయ‌బోన‌ని, అలాంటి వాటికి దూరంగా ఉంటాన‌ని వెల్ల‌డించాడు. ఇక నుంచి ఎలాంటి డీల్సూ కుదుర్చుకోన‌ని తెలిపాడు. అంతేకాకుండా మ‌రో స్ట‌న్నింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు. ఎంఎస్ ధోనీ ఇక నుంచి సేంద్రీయ వ్య‌వ‌సాయానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ లా మారాల‌నుకుంటున్నాడు. ఇందుకోసం త‌నే ఓ బ్రాండ్ క్రియేట్ చేసి.. దాన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నాడ‌ట‌.

ఇక ధోనీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం క‌రోనా వైర‌స్సే. అదేంట‌ని అనుకుంటున్నారా? ఈ క‌రోనా పూర్తిగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా త‌న ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యాడు ధోనీ. ఈ క్ర‌మంలోనే త‌న‌కు వ్య‌వ‌సాయం చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చిందట‌‌. దీంతో వెంట‌నే ఓ ట్రాక్ట‌ర్ కొని,  ఫార్మింగ్ మొద‌లు పెట్టాడు. అది కూడా సేంద్రీయ వ్య‌వ‌సాయం చేయాల‌నుకుంటున్నాడట‌‌.

జార్ఖండ్ లో ధోనీకి 50 ఎక‌రాల పొలం ఉంది. అందులో సేంద్రీయ వ్య‌వసాయం చేస్తున్నాడు. ఏ మొక్క‌ను ఎలా నాటాలి? వాటిని ఎలా పెంచాలి? స‌హ‌జ‌మైన ఎరువు ఎలా త‌యారు చేయాలి? ఇలా అన్నీ తెలుసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ధోనీ ఆర్గానిక్ ఫార్మింగ్ లో భాగంగా.. బొప్పాయి, అర‌ట‌ని సాగు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న బ్రాండ్ పేరు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. అదే నియో గ్లోబ‌ల్. ఈ పేరుతోనే ధోనీ పండించే ఉత్ప‌త్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి.

Latest Articles