రానా వెడ్డింగ్ కార్డ్స్ రెడీ.. అప్డేట్ ఇచ్చిన రానా ప్రేయసి..

|

Jul 08, 2020 | 10:46 PM

కరోనా గోల లేకుంటే.. దుగ్గుబాటి ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటేవి. చాలా కాలం తర్వాత ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కావడంతో కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు....

రానా వెడ్డింగ్ కార్డ్స్ రెడీ..  అప్డేట్ ఇచ్చిన రానా ప్రేయసి..
Follow us on

కరోనా గోల లేకుంటే.. దుగ్గుబాటి ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటేవి. చాలా కాలం తర్వాత ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కావడంతో కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్నారు. కరోనా ప్రభావం పెరుగుతుండటంతో పెళ్లి డేట్స్ పై క్లారిటీ రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టారు రానా మెచ్చిన చిన్నది మహికా బజాజ్.

పెళ్లి రోజు ఎలా రెడీ అవ్వాలో కూడా ముందుగ ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నారు. అలాగే అతిధులకు ఇవ్వాల్సిన స్పెషల్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా సిద్దం చేశారు.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. పెళ్లి రోజు వేసుకోవాల్సిన జూటిస్ షూస్ ని కూడా చూపించిన కొత్త పెళ్లి కూతురు అవి డిజైన్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి మిహికా తన పెళ్లికి అద్బుతమైన ప్లాన్స్ తో రెడీ అవుతోందనే చెప్పాలి.