మాస్క్ లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్న మెలానియా ట్రంప్

యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఘట్టం జోరుగా హుషారుగా సాగింది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా జరిగింది. ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ – ఫ్లోరిడా రిసార్ట్‌ సమీపంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. […]

మాస్క్ లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్న మెలానియా ట్రంప్
Venkata Narayana

|

Nov 04, 2020 | 7:30 AM

యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఘట్టం జోరుగా హుషారుగా సాగింది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా జరిగింది. ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ – ఫ్లోరిడా రిసార్ట్‌ సమీపంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాస్క్ ధరించకుండా ఓటింగ్ లో పాల్గొన్న మొలానియా పాం బీచ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu