Pawan Tirupati campaign : తిరుపతిలో పవన్ ప్రచార తేదీ ఖరారు, బీజేపీ కీలక నేతలతో ఏడుకొండల నగరంలో పాదయాత్ర.!

|

Mar 30, 2021 | 8:27 PM

Pawan kalyan Tirupati by poll election campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి..

Pawan Tirupati campaign : తిరుపతిలో పవన్ ప్రచార తేదీ ఖరారు, బీజేపీ కీలక నేతలతో ఏడుకొండల నగరంలో పాదయాత్ర.!
Pawan Kalyan
Follow us on

Pawan kalyan Tirupati by poll election campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి జనసేనాని ఎలక్షన్ క్యాంపెయిన్ షురూ కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖ ఎంపీ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతిస్తూ జనసేన పార్టీ పోటీ నుంచి విరమించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని రత్నప్రభకు మద్దతుగా పవన్ ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఏప్రిల్ 3న పవన్ తిరుపతిలో పాదయాత్ర నిర్వహిస్తారని.. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ పాదయాత్ర సాగుతుందని జనసేన సదరు ప్రకటనలో పవన్ తిరుపతి పర్యటన వివరాలు వెల్లడించింది. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ పాదయాత్ర నిర్వహిస్తారని.. 3వ తేదీన పాదయాత్ర తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు శంకరంబాడి సర్కిల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన పేర్కొంది. కాగా, ఈ పాదయాత్రలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీ కీలక నేతలు, అభ్యర్థిని రత్నప్రభతోపాటు పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రచారానికి రావలసిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Read also : Joyce George on Rahul : రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లొద్దు, అతనికసలే పెళ్లి కాలేదు: అమ్మాయిలకు కేరళ మాజీ ఎంపి వార్నింగ్