హ్యాకింగ్‌కు గురైన బీజేపీ అధికారిక వెబ్‌సైట్

బీజేపీ అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. పార్టీ వెబ్‌పేజ్‌లో ఎర్రర్ 522గా మంగళవారం మెసేజ్ చూపించింది. హ్యాకింగ్‌కు గురయ్యే ముందు ఆ వెబ్‌సైట్‌లో ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫొటోలు కనిపించాయని కొందరు పేర్కొన్నారు. అయితే సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలో వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచుతామని అడ్మిన్ పేర్కొన్న సందేశం కనిపిస్తుండగా.. దీనిపై బీజేపీ మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్‌సైట్లను పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేసిన విషయం […]

హ్యాకింగ్‌కు గురైన బీజేపీ అధికారిక వెబ్‌సైట్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:01 PM

బీజేపీ అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. పార్టీ వెబ్‌పేజ్‌లో ఎర్రర్ 522గా మంగళవారం మెసేజ్ చూపించింది. హ్యాకింగ్‌కు గురయ్యే ముందు ఆ వెబ్‌సైట్‌లో ప్రధాని నరేంద్రమోదీ అభ్యంతరకర ఫొటోలు కనిపించాయని కొందరు పేర్కొన్నారు. అయితే సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలో వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచుతామని అడ్మిన్ పేర్కొన్న సందేశం కనిపిస్తుండగా.. దీనిపై బీజేపీ మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్‌సైట్లను పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్‌కు గురవ్వడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

Latest Articles