డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. కానీ సినీ హీరో మంచు మనోజ్..జగన్ బర్త్ డేను సందర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ట్యాగ్ చేసిన ఫోటో కూడా చాలా ఇంట్రస్టింగ్ ఉంది.
సీఎం జగన్‌ను బావా అంటూ సంభోదించారు మంచు మనోజ్. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి, విజయమ్మలతో..జగన్ చిన్నతనంలో దిగిన ఫోటో షేర్ చేసి.. ‘భారతదేశంలోనే యువ సీఎం.. నేను అత్యంత అభిమానించే మా బావ వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ జీవితం ఆనందకంగా సాగాలి సీఎం గారూ’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
కాగా మంచు కుటుంబం గతంలో వైఎస్సార్ ఫ్యామిలీతో వియ్యమందుకున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు.. వైఎస్సార్ తమ్ముడు సుధీర్ రెడ్డి కూతుర్తె విరోనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ రిలేషన్ ప్రకారం సీఎం జగన్‌ను బావా అని ఆప్యాయంగా సంభోదించాడు మనోజ్.
Birthday Wishes to the youngest CM in India, my beloved bava @ysjagan ??
Have a happy and prosperous life CM garu ? pic.twitter.com/Z4RVXLGV8d— MM*??❤️ (@HeroManoj1) December 21, 2019